Social News XYZ     

Rangasthalam will impress everyone, Don’t miss it: Ram Charan

Rangasthalam will impress everyone, Don't miss it: Ram Charan

ప్ర‌ముఖ  ఐటీ కంపెనీ వర్చ్యూసా ది జోష్2018-అవ‌ర్ యాన్యువ‌ల్ ఎంప్లాయ్ ఎంగేజ్ మేంట్ (జోష్ ఫాంట‌సీ సెస‌న్-4) ప్రొగ్రామ్ ఉద్యోగుల‌ ఆట, పాట‌ల న‌డుమ శుక్ర‌వారం సాయంత్రం హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ముఖ్య అతిధిగా విచ్చేసి ఉద్యోగుల‌కు  జ్ఞాపిక‌ల్ని..ప్ర‌శంసా ప‌త్రాన్ని అంద‌జేశారు.

అనంత‌రం రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ, మీరు చూపిస్తోన్న ఉత్సాహాం...మిమ్మ‌ల్ని అంద‌ర్నీ చూస్తుంటే నాకు నా కాలేజ్ డేస్ గుర్తుకొస్తున్నాయి. మీ అంద‌ర్నీ ఇలా క‌ల‌వ‌డం చాలా సంతోషంగా ఉంది.  ఈనెల‌లో నాకిది బెస్ట్ డే.  ప్ర‌తీ కంపెనీకి ఉద్యోగులే కీల‌కం. వాళ్ల క‌ష్టంతోనే కంపెనీలు పైకొస్తాయి.  ఇక్క‌డ ఉద్యోగులే వర్య్చూస్ ను ఈ స్థాయిలో నిల‌బెట్టార‌నిపిస్తోంది.  వర్చ్యూస్ లో  ప‌నిచేస్తోన్న చాలా మంది ఉద్యోగులు ర‌క్త‌దానం చేశారు. చాలా మంచి సేవా కార్య‌క్ర‌మం అది. మేము త‌ల‌పెట్టిన ఆ కార్య‌క్ర‌మానికి ఇంత‌మంది ఎంతో బాధ్య‌త తీసుకుని చేస్తున్నంద‌కు చాలా గ‌ర్వంగా ఉంది. ఇలాగే మ‌రిన్ని మంచి కార్య‌క్ర‌మాలు చేయాల‌ని కోరుకుంటున్నా. డాన్స్, పాట‌ల ప్ర‌ద‌ర్శ‌న చాలా బాగుంది. హ‌రితరంగ‌మ్మ మంగ‌మ్మపాటను ఒరిజిన‌ల్ సింగ‌ర్ క‌న్నా బాగా పాడారు. ఇక రంగ‌స్థ‌లం సినిమా కోసం ఏడాది పాటు క‌ష్ట‌ప‌డ్డాను. గుబురు గెబ్బం... మీసం తోనే ఉన్నారు. ఆరెండు తీసిన త‌ర్వాత హ‌జ‌రైన తొలి కార్య‌క్ర‌మం ఇది. ఇలాంటి మంచి కార్య‌క్ర‌మాలు చేస్తే మీరు ఎప్పుడు పిలిచినా రావ‌డానికి నేను సిద్దం. రంగ‌స్థ‌లం సినిమా అద్భుతంగా వ‌చ్చింది. ఈ సినిమా నాకొక కొత్త అనుభూతినిచ్చింది. నా గ‌త సినిమాలు మిస్ అయినా...ఈ సినిమా మాత్రం త‌ప్ప‌కుండా అంద‌రూ చూడండి. అంద‌రికీ క‌చ్ఛితంగా న‌చ్చుతుంది అని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో వ‌ర్చ్యూస్ యాజ‌మ‌న్యం, ఉద్యోగులు పాల్గొన్నారు.

 

Facebook Comments
Rangasthalam will impress everyone, Don't miss it: Ram Charan

About uma