Social News XYZ     

Weapon movie final schedule from March 20th

మార్చి 20 నుంచి 'వెపన్‌' చివరి షెడ్యూల్‌ 

Weapon movie final schedule from March 20th

'మంగళ', 'క్రిమినల్స్‌' వంటి విభిన్న చిత్రాలను నిర్మించిన మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందుతున్న మరో డిఫరెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'వెపన్‌'. అవినాష్‌, ప్రదీప్‌ రావత్‌, రాజారాయ్‌, రాజు, మధుబాబు ప్రధాన పాత్రల్లో ఆర్‌.ఎస్‌.సురేష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శర్మ చుక్కా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్‌ మార్చి 20 నుంచి జరుగుతుంది.

 

ఈ సందర్భంగా నిర్మాత శర్మ చుక్కా మాట్లాడుతూ ''ఇప్పటివరకు జరిగిన షెడ్యూల్స్‌తో 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. రామచంద్రాపురం, పసలపూడి పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేశాం. రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగే వార్‌ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. 'వెపన్‌' టైటిల్‌కి పూర్తి జస్టిఫికేషన్‌ ఇచ్చే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. దర్శకుడు సురేష్‌ ప్రతి సీన్‌ని చాలా అద్భుతంగా తీస్తున్నారు. గతంలో వచ్చిన 'మంగళ', 'క్రిమినల్స్‌' చిత్రాలు మా బేనర్‌కి మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి. 'వెపన్‌' చిత్రం దాన్ని రెట్టింపు చేస్తే స్థాయిలో ఉంటుందని కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. బ్యాలెన్స్‌ షూటింగ్‌ పార్ట్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేసి సమ్మర్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

అవినాష్‌, ప్రదీప్‌ రావత్‌, రాజా రాయ్‌, రాజు, మధుబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అనిల్‌ పి., రచనా సహకారం: నరేష్‌ ధ్యాన్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సబ్బారపు ప్రకాష్‌, నిర్మాత: శర్మ చుక్కా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్‌.ఎస్‌.సురేష్‌.

Facebook Comments
Weapon movie final schedule from March 20th

About uma