Social News XYZ     

VS Creative Works Production No 1 with Rahul Vijay & Kavya Thapar completes talkie

రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌ చిత్రం టాకీ పూర్తి

VS Creative Works Production No 1 with Rahul Vijay & Kavya Thapar completes talkie

ప్ర‌ముఖ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్‌ బేనర్‌పై ఓ చిత్రం రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. రాము కొప్పుల దర్శకుడు. దివ్య విజయ్‌ నిర్మాత. ఈ చిత్రం టాకీ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా...

 

దర్శకుడు రాము కొప్పుల మాట్లాడుతూ - ``సినిమా టాకీ పార్ట్ అంతా అనుకున్న విధంగా పూర్తైంది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. రాహుల్ బాడీ లాంగ్వేజ్‌కి స‌రిపోయే క‌థ‌.త‌ను క్యారెక్ట‌ర్‌లో అద్భుతంగా న‌టించారుత్వ‌ర‌లోనే మిగ‌తా వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం` అన్నారు.

నిర్మాత దివ్య విజయ్‌ మాట్లాడుతూ - డైరెక్ట‌ర్ రాముగారు రాహుల్‌ను చాలా చ‌క్క‌గాతెర‌కెక్కిస్తున్నారు. ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమా అంద‌రినీ మెప్పించేలా ఉంటుంది. రాహుల్‌, కావ్య థాప‌ర్ జోడి స్క్రీన్‌పై చ‌క్క‌గా ఉన్నారు. సినిమా అవుట్‌పుట్ బాగా వ‌స్తుంది. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్భుత‌మైన బాణీల‌ను అందించారు. అలాగే శ్యామ్ కె.నాయుడుగారి సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు మ‌రో ఎసెట్ అవుతుంది. టాకీ పార్ట్ పూర్తైన ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్నాయి. మిగ‌తా వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియజేస్తాం అన్నారు.

రాహుల్‌ విజయ్‌, కావ్య థాప‌ర్‌, రాజేంద్ర ప్రసాద్‌, మురళీశర్మ, పవిత్ర లోకేష్‌, పోసాని కృష్ణమురళి, ఈశ్వరీరావు, రాళ్ల‌ప‌ల్లి, సత్యం రాజేష్‌, జోష్‌ రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: శ‌్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, ఫైట్స్‌: విజయ్‌, ఆర్ట్‌: చిన్నా, సాహిత్యం: శ్రీమణి, పి.ఆర్‌.ఒ: వంశీ కాకా, లైన్‌ ప్రొడ్యూసర్‌: రాజు ఓలేటి, నిర్మాత: దివ్య విజయ్‌, రచన, దర్శకత్వం: రాము కొప్పుల.

Facebook Comments
VS Creative Works Production No 1 with Rahul Vijay & Kavya Thapar completes talkie

About uma