హరీష్ శంకర్ దర్శకత్వం లో `సీటీమార్`

గబ్బర్ సింగ్‌తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సూపర్‌హిట్ చిత్రం దువ్వాడ జగన్నాథమ్‌లోని సీటీ మార్ సీటీ మార్.. అనే సాంగ్ ఎంత పాపులార్ అయ్యిందో మనకు తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన సినిమాలో హిట్ సాంగ్‌లోని సీటీమార్ అనే టైటిల్‌తో త్వరలోనే ఓ సినిమా తెరకెక్కనుండటం విశేషం.
హరీష్ శంకర్.. ప్రస్తుతం దిల్‌రాజు బ్యానర్‌లో దాగుడుమూతలు అనే సినిమాను రూపొందించే పనిలో భాగంగా స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తికాగానే జవాన్ చిత్రాన్ని నిర్మించిన అరుణాచల్ క్రియేషన్స్ పతాకంపై కొమ్మలపాటి కృష్ణ నిర్మాణంలో హీరష్ శంకర్ సీటీమార్ సినిమాను డైరెక్ట్ చేస్తారు. ఈ సినిమాలో వరుస హిట్స్ సాధిస్తున్న యువ కథానాయకుడు ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు.త్వరలోనే చిత్ర యూనిట్ పూర్తి వివరాలను తెలియజేస్తుంది.