Social News XYZ     

Bhaagamathie to watch movie with women

మ‌హిళ‌ల‌తో సినిమా చూడ‌నున్న "భాగ‌మ‌తి"

Bhaagamathie to watch movie with women

క్వీన్ ఆఫ్ టాలీవుడ్ అనుష్క ముఖ్య పాత్రలో తెరకెక్కించిన భాగమతి చిత్రం విడుద‌ల‌య్యి ఘ‌న‌విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే క‌లెక్ష‌న్ల ప‌రంగా దూసుకుపోతుంది. ఓ మ‌హిళ త‌న‌కొచ్చిన స‌మ‌స్య ద‌గ్గ‌రే ఆగిపోకుండా త‌న స‌మ‌స్య‌ని ఎదుర్కోని ప‌దిమందికి ఎలా వుప‌యోగ‌ప‌డింది అనే కాన్సెప్ట్ తో సౌత్ ఇండియాలో విజ‌ఢంకా మెగిస్తుంది. అంతేకాదు ఈ చిత్రానికి అత్య‌ధికంగా మ‌హిళా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ఎక్కువుగా వుండ‌టం విశేషం. ఈ విష‌యం తెలుసుకున్న టాలీవుడ్ క్వీన్ అనుష్క గారు మహిళా ప్రేక్ష‌కుల‌తో చిత్రాన్ని చూడాలని నిర్ణ‌యించుకున్నారు. చిత్రాన్ని వారితో చూసి వారికి థ్యాంక్స్ చెప్పాల‌ని నిర్ణయించుకున్నారు.

 

భాగ‌మ‌తి విచ్చేస్తున్న అడ్డాలు....
02-05-2018 సోమ‌వారం...

విజ‌య‌వాడ - రాజ్ ధియెట‌ర్‌(మెర్నింగ్ షో).
ఏలూరు- మిని స‌త్య‌నారాయ‌ణ (మ్యాట్ని),
రాజ‌మండ్రి- స్వామి (మెద‌టి ఆట‌)

భాగ‌మ‌తి చిత్రాన్ని చూసి ఆశీర్వ‌దించిన మ‌హిళా లోకానికి త‌న వంతుగా థ్యాంక్స్ చెప్ప‌టానికి అనుష్క గారు విచ్చేస్తున్నారు. ఇది కేవ‌లం మ‌హిళా ప్రేక్ష‌కుల‌కి మాత్ర‌మే.

Facebook Comments
Bhaagamathie to watch movie with women

About uma