Social News XYZ     

Varun Tej’s Tholi Prema audio release on January 20th

జ‌న‌వ‌రి 20న మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ `తొలి ప్రేమ‌` ఆడియో 

Varun Tej's Tholi Prema audio release on January 20th

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి ప‌తాకంపై నిర్మిత‌మ‌వుతున్న చిత్రం తొలిప్రేమ‌. రాశి ఖ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. యువ ద‌ర్శకుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌కుడు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాత‌. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా పాట‌ల‌ను జ‌న‌వ‌రి 20న విడుద‌ల చేస్తున్నారు.

 

ఈ సంద‌ర్భంగా... నిర్మాత బివిఎస్ఎన్ ప్ర‌సాద్ మాట్లాడుతూ - కెరీర్ స్టార్టింగ్ నుండి విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ వ‌చ్చిన వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న చిత్రం `తొలి ప్రేమ‌`. హృద‌యానికి హ‌త్తుకునే ప్రేమ‌క‌థ‌. వ‌రుణ్ తేజ్ కొత్త పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌, నిన్నిలా నిన్నిలా చూశానే...అనే సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. త‌మ‌న్ సంగీతం అందించిన ఈ మూవీ సాంగ్స్‌ను జ‌న‌వ‌రి 20న గ్రాండ్‌గా విడుద‌ల చేస్తున్నాం. అలాగే  ఫిబ్ర‌వరి 9న సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం అన్నారు.

వ‌రుణ్ తేజ్‌, రాశిఖ‌న్నా హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈచిత్రానికి సంగీతంః ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ:  జార్జ్ సి.విలియ‌మ్స్‌.

Facebook Comments
Varun Tej's Tholi Prema audio release on January 20th

About uma