Social News XYZ     

Rahul Ravindran’s Howrah Bridge completes censor, release at the end of December

రాహుల్ రవీంద్రన్ హౌరా బ్రిడ్జ్ సెన్సార్ పూర్తి, డిసెంబర్ నెలాఖరులో విడుదల

Rahul Ravindran's Howrah Bridge completes censor, release at the end of DecemberHowrah-Bridge-new-wallpapers-1.jpgశ్రీ వడ్డేపల్లి సత్యనారాయణ ఆశీర్వచనాలతో ... ఈ ఎమ్ వి ఈ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరో హీరోయిన్లుగా రేవన్ యాదు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం హౌరా బ్రిడ్జ్. విభిన్నమైన కథలతో దూసుకెళ్తున్న రాహుల్ రవీంద్రన్ మరో ఇంట్రస్టింగ్ స్టోరీతో మన ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. డిసెంబర్ నెలాఖరులో సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా హీరో రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ... హౌరా బ్రిడ్జ్ అనే టైటిల్ పెట్టడం వెనక పెద్ద రీజన్ ఉంది. కానీ ఇప్పుడు రివీల్ చేయలేం. హ్యూమన్ రిలేషన్స్ కి ఈకథ బ్రిడ్జ్ గా ఉంటుంది. ఇందులో మరో బ్రిడ్జ్ కూడా ఉంటుంది. అది ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. చాందినీ చౌదరి ఇందులో చాలా మంచి క్యారెక్టర్లో నటించింది. మనాలీ రాథోడ్ కి ఈ సినిమా చాలా మంచి పేరు తెస్తుంది. దర్శకుడు  రేవన్ చాలా క్లారిటీతో ఉన్నాడు. అధ్బుతమైన విజువల్స్ మిమ్మల్ని వండర్ చేస్తాయి. చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. డిసెంబర్ నెలాఖరులో గ్రాండ్ రిలీజ్ తో మీ ముందుకు వస్తున్నాం.  నా కెరీర్లో అందరూ మెచ్చుకునే చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. అని అన్నారు.

 

దర్శకుడు రేవన్ మాట్లాడుతూ... ఇది నా రెండో ప్రాజెక్ట్. బూచమ్మ బూచోడు నాకు చాలా మంచి పేరు తెచ్చింది. రాహుల్ రవీంద్రన్ చాలా మంచి పెర్ ఫార్మర్. ఇది బ్రిడ్జ్ నేపథ్యంలో సాగే ఇంట్రస్టింగ్ స్టోరీ. అందుకే హౌరా బ్రిడ్జ్ అని పెట్టాం. కథలో అనేక ట్విస్టులుంటాయి. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో మెస్మరైజ్ చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చేదిగా ఉంటుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేశాం. సెన్సార్ సభ్యుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. సో... చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ సినిమాలో ప్రతీ క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. డిసెంబర్ నెలాఖరులో సినిమాను విడుదల చేస్తున్నాం.  అని అన్నారు.

నటీనటులు
రాహుల్ రవీంద్రన్
చాందినీ చౌదరి
మనాలీ రాథోడ్
రావ్ రమేష్
అజయ్
ఆలీ
పోసాని కృష్ణ మురళి
ప్రభాస్ శ్రీను,
విద్యుల్లేఖ
జబర్దస్త్ రాకింగ్ రాకేష్ తదితరులు

టెక్నీషియన్స్
శ్రీ వడ్డేపల్లి సత్యనారాయణ ఆశీర్వచనాలతో
మ్యూజిక్ డైరెక్టర్ - శేఖర్ చంద్ర
సినిమాటోగ్రాఫర్ - విజయ్ మిశ్రా
ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత - ఈ ఎమ్ వి ఈ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - రేవన్ యాదు

Facebook Comments
Rahul Ravindran's Howrah Bridge completes censor, release at the end of December

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: