Social News XYZ     

“Oxygen” movie is a must watch for next generation: “IDA” & “TII” Doctors

"ఆక్సిజన్" భవిష్యత్ తరాలు తప్పక చూడాల్సిన చిత్రం !!

"Oxygen" movie is a must watch for next generation: "IDA" & "TII" Doctors

గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆక్సిజన్". గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఏమాన్యూల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మించారు. గతవారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు అందుకొంటూ విజయపధంలో దూసుకెళుతోంది. అయితే.. సినిమా ముఖ్యాంశమైన "టొబాకో నియత్రత్వం" కాన్సెప్ట్ ను మెచ్చిన స్టేట్ హెల్త్ అసోసియేషన్ మరియు "IDA", "Tobacco Intervention Initiative" సంస్థల కోసం నేడు "ఆక్సిజన్" స్పెషల్ షో హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ జ్వాల చైతన్య, డాక్టర్ సుధీర్ రెడ్డి, డాక్టర్ సత్యేంద్ర, డాక్టర్ పి.కరుణాకర్, డాక్టర్ ఎ.శ్రీకాంత్ మరియు హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎస్.నాగరాజులతోపాటు చిత్ర దర్శకుడు జ్యోతికృష్ణ కూడా పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా దర్శకుడు జ్యోతికృష్ణ మాట్లాడుతూ.. "సినిమా విడుదలైనప్పుడు మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. చాలా ఏరియాస్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే.. విజయవాడ స్టేట్ హెల్త్ అసోసియేషన్ నుంచి శివశంకర్ గారు ఫోన్ చేసి "మేం చేయాల్సిన పనిని మీ సినిమా ద్వారా మీరు చేశారు" అంటూ ఒక అభినందన లేఖ పంపారు. అలాగే.. ఇప్పుడు మా చిత్రాన్ని చూసిన "IDA" అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కృతజ్నతలు. ఈ చిత్రానికి చాలా అవార్డ్స్ ఎక్స్ ఫెక్ట్ చేస్తున్నాను. ఈ తరానికే కాదు భవిష్యత్ తరాలకు కూడా చాలా ముఖ్యమైన సినిమా "ఆక్సిజన్"" అన్నారు.

మేము మా ప్రొఫెషనల్ లైఫ్ లో చాలామంది పేషెంట్స్ లో కనిపిస్తున్న సమస్యలను "ఆక్సిజన్" సినిమాలో చాలా అర్ధవంతంగా చూపించడం జరిగింది. నిజానికి టోబాకో అనేది లీగల్ అయినా ఇల్లీగల్ అయినా హెల్త్ కి హానికరం. యువత ధూమపానానికి మాత్రమే కాదు, డ్రగ్స్, మందు వంటి అన్నిటికీ దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంవత్సరానికి 12 లక్షల మంది క్యాన్సర్ కారణంగా చనిపోతుంటే.. వారిలో కేవలం 45% మంది టొబాకో కారణంగా ప్రాణాలు పోగొట్టుకొంటున్నారు. నేటి యువతకు అత్యంత ముఖ్యమైన ఈ మెసేజ్ ను సినిమా అనే మాధ్యమం ద్వారా తెలియజెప్పిన దర్శకుడు ఎం.జ్యోతికృష్ణ ను మా "IDA" సంస్థ ద్వారా ప్రశంసిస్తున్నాం. ఏ.ఎం.రత్నంగారు ఇలాంటి సొసైటీకి పనికొచ్చే చిత్రాలు మరిన్ని నిర్మించాలని కోరుకొంటున్నాం. ఇలాంటి సమస్యలను మనం రోజూ చూస్తూనే ఉంటాం.. కానీ "ఆక్సిజన్" చిత్రంలో హృద్యంగా తెరకెక్కించడం అభినందనీయం. ఈ సినిమా చూశాక కొందరైనా వారి సిగరెట్ అలవాటును మార్చుకోవాలని ఆశిస్తున్నామన్నారు "ఇండియన్ డెంటల్ అసోసియేషన్" డాక్టర్స్ మరియు హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎస్.నాగరాజు.

Facebook Comments
"Oxygen" movie is a must watch for next generation: "IDA" & "TII" Doctors

About Gopi Adusumilli

Gopi Adusumilli is a Programmer at Excellus Blue Cross Blue Shield. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc. He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources. When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any. He can be reached at gopi@socialnews.xyz

Advertisements
%d bloggers like this: