Social News XYZ     

Indrasena mouth talk is positive: Vijay Antony

ఇంద్రసేన కు  మౌత్ టాక్ పాజిటివ్ గా  ఉంది- విజయ్ ఆంథోని

Indrasena mouth talk is positive: Vijay Antony

విజయ్ ఆంథోని హీరోగా నీలం లక్ష్మి సమర్పణలొ నీలం కృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం ఇంద్రసేన. జి.శ్రీనివాసన్ దర్శకుడు.  బ్రదర్ సెంటిమెంట్ తో , విజయ్ ఆంథోని ద్విపాత్రాభినయంతో నటించి  ఇంద్రసేన గత వారాంతంలొ విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. ప్రసాద్ ల్యాబ్స్ లొ ఈ చిత్ర సక్సెస్ మీట్ ను చిత్ర యూనిట్ ఏర్పాటు చెసింది.

 

విజయ ఆంథోని మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని ఎప్పుడు ఎంకరేజ్ చెస్తారని ఇంద్రసేన తో మరొసారి నిరూపించారు. తెలుగుతో పాటు, తమిళ్ లోను మా చిత్రానికి ప్రేక్షకాదరణ బాగుంది. వాస్తవానికి దగ్గరగా ఇంద్రసేన ఉందంటున్నారు. ఆడియెన్స్ మౌత్ టాక్ ఇంద్రసేన కు చాలా పాజిటివ్ గా ఉంది. బిచ్చగాడు తరహాలొనె ఇంద్రసేన కు రొజులు గడిచె కొద్ది ఆదరణ పెరగనుంది.మంచి సినిమాలు చెయటానికి మాకు మరింత ఉత్సాహాన్ని ఇంద్రసేన సక్సెస్ అందించిందన్నారు.

నిర్మాత కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మా బ్యానర్ ఎన్.కె.ఆర్.ఫిలింస్  లో ఇంద్రసేన హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది. ఏ సినిమాకైనా ప్రేక్షకుల ఆదరణే ఫైనల్. ఇంద్రసేన అది 100% లభించిందన్నారు.

రచయిత భాష్యశ్రీ మాట్లాడుతూ..  మదర్ సెంటిమెంట్ తో బిచ్చగాడు కంటే  బ్రదర్ సెంటిమెంట్ తో ఇంద్రసేన గా విజయ్ ఆంథోని
నటన ప్రేక్షకులకు బాగా నచ్చింది. నా మాటలు, పాటలకు ముఖ్యంగా వజ్రమా పాటకు మంచి రెస్పాన్స్ లభించిందన్నారు.

హీరొయిన్ మహిమ మాట్లాడుతూ.. ఇంద్రసేన లొని  సెంటిమెంట్ , త్యాగం మహిళా ప్రేక్షకులకు బాగా నచ్చాయి. తాను చెసిన ఈశ్వరి పాత్ర ఎప్పటికి ది బెస్ట్ గా నిలిచిపొతుందన్నారు.

విజయ్ ఆంథోని, డైనా చంపిక, మహిమా,  జ్వెల్ మారీ, రాదా రవి, కాళీ వెంకట్, నళినీ కాంత్ రింధు రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి  మాటలు- సాహిత్యం:భాష్యశ్రీ, ఆర్ట్ : ఆనంద్ మణి, సంగీతం- కూర్పు: విజయ్ ఆంథోని, సినిమాటోగ్రఫీ : కె.దిల్ రాజ్, లైన్ ప్రొడ్యూసర్: శాండ్రా జాన్సన్, నిర్మాతలు:.  నీలం కృష్ణారెడ్డి , రాధికా శరత్ కుమార్ , విజయ్ ఆంథోని,దర్శకత్వం: జి.శ్రీనివాసన్.

Facebook Comments
Indrasena mouth talk is positive: Vijay Antony

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: