Social News XYZ     

Muddula Mogudu movie shaping up as an hilarious entertainer

హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా 'ముద్దుల మొగుడు' 

Muddula Mogudu movie shaping up as an hilarious entertainerప్రస్తుతం ఉన్న మాధ్యమాల్లో సోషల్‌ మీడియా అతి వేగంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. దీంతో టాలెంట్‌ ఉన్న నటీనటులు, దర్శకులు ఈ మాధ్యమం ద్వారా తమ ప్రతిభను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈమధ్యకాలంలో వెబ్‌ సిరీస్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు కొంతమంది కొత్త దర్శకులు. జబర్దస్త్‌ కార్యక్రమం ద్వారా ఎక్కువ ప్రేక్షకాదరణ పొందిన గెటప్‌ శ్రీను, అప్పారావు వంటి ఆర్టిస్టులతో నాగరాజ దండు ఓ వెబ్‌ సిరీస్‌ని ప్రారంభిస్తున్నారు. 'ముద్దుల మొగుడు' పేరుతో హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సిరీస్‌ను తీర్చిదిద్దుతున్నారు. గౌతమ్‌ సమర్పణలో శ్రీ మురళీకృష్ణ ఆర్ట్స్‌ పతాకంపై పొన్నపాటి కృష్ణవేణి ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. 'ముద్దుల మొగుడు' టైటిల్‌ రోల్‌ను గెటప్‌ శ్రీను పోషిస్తున్నారు. ఇటీవల నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి ఈ వెబ్‌సిరీస్‌ను ప్రారంభించారు. నవంబర్‌ 24 నుండి youtube లోyodha tv channel ద్వారా 'ముద్దుల మొగుడు'ను వీక్షించవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా వున్న యూ ట్యూబ్‌ ప్రేక్షకులు ఈ వెబ్‌ సిరీస్‌ని ఆదరించి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నట్టు దర్శకుడు నాగరాజ దండు తెలిపారు.

గెటప్‌ శ్రీను, జబర్దస్త్‌ అప్పారావు, కాటంరెడ్డి, ఫన్‌బకెట్‌ భరత్‌, కౌశిక, దివ్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌కి కెమెరా: ఎస్‌.ఎస్‌.రాజు, సంగీతం: అజయ్‌ పట్నాయక్‌, సమర్పణ: గౌతమ్‌, నిర్మాత: పొన్నపాటి కృష్ణవేణి, దర్శకత్వం: నాగరాజ దండు.

 

Facebook Comments
Muddula Mogudu movie shaping up as an hilarious entertainer

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: