Social News XYZ     

SUSWARA Carnatic Fusion on 14th NOV 2017 – Press Note

ఇళయరాజా గానామృతం మరువక ముందే, హైదరాబాద్ మరో సంగీత విభావరికి వేదిక కానుంది.

SUSWARA Carnatic Fusion on 14th NOV 2017 - Press Note

దక్షిణ భారతావనిలో ఘనమైన చరిత్ర కర్ణాటక సంగీతానిది. ఎందరో మహానుభావులు ఈ సాంస్కృతిక సంపదని సుసంపన్నం చేశారు. ఆ వాఙ్మయ వారసత్వం తరం తరం నిరంతరం కొనసాగాలని, ఆ వాగ్గేయకారులను స్మరించుకుంటూ ఈతరం కోసం HTO CLUB ఒక వేదికను ఏర్పాటు చేసింది. సంగీతానికి ఎంతో సేవ చేసిన బెంగుళూరు నాగరత్నమ్మ గారి పేరును ఆ వేదికకు పెట్టడం ద్వారా సంగీత ప్రియులందరికీ ఆవిడను స్మరించుకునే అవకాశాన్ని HTO CLUB కలిగించింది. సుగంధాల గానాలు వెదజల్లే ఈ మహత్తర కార్యక్రమానికి “సుస్వర” అని నామకరణం చేయడం జరిగింది.

 

HTO CLUB ఆధ్వర్యంలో జరిగే ఈ “సుస్వర - Carnatic Fusion” కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మరియు తమిళనాడు లోని పది ప్రఖ్యాత సంగీతాలయాల నుండి విద్యార్థులు పాల్గొంటున్నారు. వీరితో పాటు ప్రముఖ సినీ గాయనీ గాయకులు నిహాల్, శ్రీనిధి మరియు పృథ్వీచంద్రలు వారి గీతాలతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 14న ఫీనిక్స్ ఎరీనా, హైటెక్ సిటీ, హైదరాబాద్ లో సాయంత్రం 04:00 గం.ల నుండి మూడు గంటల పాటు ఈ సంగీత విభావరి కొనసాగనుంది.

HTO CLUB తరఫున ప్రముఖ సినీ దర్శకులు వీరశంకర్ సంగీత ప్రియులందరిని బంధుమిత్ర సపరివార సమేతంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు.

Facebook Comments
SUSWARA Carnatic Fusion on 14th NOV 2017 - Press Note

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: