Social News XYZ     

Shivakasipuram movie second song released

శివకాశీపురం లో ఎస్పీ బాలు పాడిన పాటని రిలీజ్ చేసిన చిత్ర బృందం 

Shivakasipuram movie second song released

సంగీత ద‌ర్శ‌కులు చ‌క్ర‌వ‌ర్తి మ‌న‌వ‌డు రాజేశ్ శ్రీ చ‌క్ర‌వ‌ర్తి క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ సాయి హ‌రేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ పై హ‌రీష్ వ‌ట్టి కూటి ద‌ర్శ‌క‌త్వంలో మోహ‌న్ బాబు పులిమామిడి నిర్మిస్తోన్న చిత్రం శివ‌కాశీపురం. ప‌వ‌న్ శేష సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక శర్మ నటించింది . కాగా  ఈ సినిమాలోని రెండో  పాట‌ను శుక్ర‌వారం ఉదయం నేరుగా రిలీజ్ చేసారు . ఇంతకుముందు  హైద‌రాబాద్ లోని ఎఫ్‌.ఎమ్ స్టేష‌న్ లో తొలిపాట ని  రిలీజ్ చేయగా ఇప్పుడు రెండో పాటని రిలీజ్ చేసారు చిత్ర బృందం . ఇక రెండో పాట విశేషం ఏంటంటే గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నచ్చి మెచ్చి పాడిన పాట కావడం .  '' అమ్మ అందని త్యాగం , కోటి దైవాల రూపం '' అనే పాట కు బాలు ఆలపించగా పవన్ శేష సంగీతం అందించాడు . అమ్మ లోని గొప్పతనాన్ని ఇప్పటివరకు ఎన్నో పాటల రూపంలో వచ్చింది కానీ ఎన్నో వేల పాటలను పాడిన బాలు మా కథ లోని డెప్త్ ని , పాటలోని ఆంతర్యాన్ని అర్ధం చేసుకొని ఎంతో మక్కువతో పాట పాడటం మాకు గర్వాంగా ఉందని తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు దర్శకులు హరీష్ వట్టికూటి .

 

ఈసంద‌ర్భంగా చిత్ర నిర్మాత మోహ‌న్ బాబు పులి మామిడి మాట్లాడుతూ, ` బాలసుబ్రహ్మణ్యం కు నేను పెద్ద అభిమానిని , ఆయన పాటలు అంటే నాకు అమితానందం అలంటి గొప్ప వ్యక్తి నేను నిర్మిస్తున్న మొదటి సినిమాకే పాడటం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది , ఆయన పాడిన అద్భుతమైన పాట ని ఈరోజు ఆదిత్య ద్వారా రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది అలాగే చక్రవర్తి మనవడిని చిత్ర పరిశ్రమకు నేను పరిచయం చేస్తున్నందుకు కూడా గర్వంగా ఉంది .

సంగీత ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ శేష మాట్లాడుతూ, గులాబీ, ల‌వ్ స్టేట్స్ చిత్రాల‌కు సంగీతం అందించా. ఇది నాకు మూడ‌వ సినిమా. నిర్మాత పులిమామిడి మోహన్ బాబు ఖర్చుకు వెనకాడకుండా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు .  మొత్తం నాలుగు పాట‌లున్నాయి ఈ చిత్రంలో , సంగీతానికి ఎక్కువ స్కోప్ ఉన్న  చిత్రం. ఎస్. పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యంగా రు మా సినిమాలో పాడిన అమ్మ పాట సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని అన్నారు .

చ‌మ్మ‌క్ చంద్ర‌, సూర్య‌, జ‌బ‌ర్ ద‌స్త్ రాము, దిల్ ర‌మేష్‌, న‌వీర్ జ‌బ‌ర్ ద‌స్త్, ల‌క్ష్మీ, ర‌వీంద్ర‌, మాస్ట‌ర్ హ‌రి, హ‌రికృష్ణ పులిమామిడి త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : ప‌వ‌న్ శేష‌, కెమెరా :  జి. రామిరెడ్డి, ఎడిటింగ్:  జియోజిథామ‌న్, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: అక్క‌ల చంద్ర‌మౌళి, నిర్మాత మోహ‌న్ బాబు పులిమామిడి, రచ‌న‌, ద‌ర్శ‌క‌త్వం హ‌రీష్ వ‌ట్టికూటి.

Facebook Comments
Shivakasipuram movie second song released

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: