Social News XYZ     

Hitech Killer Movie to release in December

మాఫియా నేపధ్యంలో   "హైటెక్ కిల్లర్ "

Hitech Killer Movie to release in December

మాజీ "మిస్టర్ ఆంధ్ర" బల్వాన్ హీరోగా మౌనిక హీరోయినిగా  వి వి వి దర్శకత్వంలో  సోహ్రాబ్  ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న యాక్షన్ త్రిల్లర్  చిత్రం  "హైటెక్ కిల్లర్  " మాఫియా గ్యాంగ్ ఏ దేశంలో ఉన్నా..  హైదరాబాద్ అడ్డాగా మారింది .దీనిని ఆధారం గా  తీసుకుని ఈ చిత్రం రూపొందించబడింది .

 

చిత్ర నిర్మాత మజ్ను సోహ్రాబ్ మాటలాడుతూ ....
ప్యాచ్ వర్కు మినహా  టాకీను పూర్తిచేసుకున్న ఈ చిత్రం లో మూడు ఫైట్లు,ఆరు పాటలున్నాయి .సంగీత దర్శకుడు యస్. కె. మజ్ను స్వరపరచిన  పాటల బాణీలు శ్రోతలను అలరిస్తాయని,డాన్స్ మాస్టర్ నేతృత్వంలో ఐదు రాత్రుళ్ళు తీసిన ఓ రేయి న్  సాంగ్ చిత్రం లో హైలెట్ గా నిలుస్తుందని. దసరాకు ఆడియో పాటలను, డిసెంబర్ లో సినిమాను విడుదల చేస్తామని  అన్నారు.

సహా నిర్మాత, యమ్. భాగ్యలక్ష్మి   మాటలాడుతూ ....
ఇటీవల కాలంలో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా కొన్ని కల్పిత పాత్రలతో   చిత్రీకరించాం  ఆ బాల గోపాలాన్ని  అలరించే విధంగా  ఈ చిత్రం ఉంటుందన్నారు.

ఇంకా ఈ చిత్రంలో సత్య ప్రకాష్ ,చందు, అన్నపూర్ణ మ్మ  , గౌతమ్ రాజు,ప్రసన్న కుమార్,పావలా శ్యామల, దిల్ రమేష్, మిమిక్రీ మూర్తి,సంపత్ రాజ్,శివ సత్యనారాయణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:యాదగిరి,ఫైట్స్:అవినాష్. డాన్స్ : బ్రదర్  ఆనంద్  నిర్మాతలు: మజ్ను సోహ్రాబ్, యమ్. భాగ్యలక్ష్మి . కథ, మాటలు,పాటలు,స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, ఆర్ట్ ,సంగీతం, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : ఎస్. కె మజ్ను దర్శకత్వం :వి వి వి

 

Facebook Comments
Hitech Killer Movie to release in December

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: