Social News XYZ     

Telugu Cine Fighters Union gives Chance to 75 New Fighters

తెలుగు సినీ ఫైటర్స్‌ యూనియన్‌ ద్వారా 75 మంది నూతన ఫైటర్స్‌కి అవకాశం 

Telugu Cine Fighters Union gives Chance to 75 New Fighters

తెలుగు సినీ ఫైటర్స్‌ యూనియన్‌ ఛైర్మన్‌ చిన్న శ్రీశైలం యాదవ్‌ ఆధ్వర్యంలో ఆగస్ట్‌ 13న సుమారు 200 మంది నుండి 75 మంది అత్యుత్తమ ఫైటర్స్‌ని ఎంపిక చేయడం జరిగింది. యూసఫ్‌గూడలోని చిన్న శ్రీశైలం యాదవ్‌ గ్రౌండ్‌లో జరిగిన ఈ ఫైటర్స్‌ ఎంపిక కార్యక్రమంలో సుమారు 200 మంది పాల్గొనడం జరిగింది. తెలుగు సినీ ఫైటర్స్‌ యూనియన్‌ ఛైర్మన్‌ చిన్న శ్రీశైలం యాదవ్‌, ఈ తెలుగు సినీ ఫైటర్స్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ పి. సతీష్‌, సెక్రటరీ పవన్‌కుమార్‌ సాల్వీ, అడ్వజైర్‌ నాగరాజ్‌ ముదిరాజ్‌, క్యాషియర్‌ రమేష్‌రాజు, ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌-లక్ష్మణ్‌, నందు, రమణ, సాల్మన్‌ మాస్టర్‌ ల సమక్షంలో ఫైటర్స్‌ను వివిధ పరీక్షల ద్వారా ఎంపిక చేయడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలోని యూనియన్‌ సభ్యులు ఛైర్మన్‌ చిన్న శ్రీశైలం యాదవ్‌ను ఘనంగా సత్కరించారు. కాగా, రాబోయే దసరా కు నూతనంగా ఎంపిక చేసిన 75 ఫైటర్స్ కు యూనియన్ కార్డ్స్ జారీ చేయనున్నామని ఈ సందర్భంగా చైర్మన్  చిన్న శ్రీశైలం యాదవ్‌ తెలిపారు.

 

Facebook Comments
Telugu Cine Fighters Union gives Chance to 75 New Fighters

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: