Social News XYZ     

Ammiraju panel grabs Telugu Cine Production Executives Union election

అమ్మిరాజు ప్యానల్‌ ఘన విజయం

Ammiraju panel grabs Telugu Cine Production Executives Union election

తెలుగు సినీ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ యూనియన్‌ కు జరిగిన ఎన్నికలలో 3 ప్యానల్స్‌ పోటీ చేయగా అందులో అమ్మిరాజు కానుమిల్లి ప్యానల్‌ అఖండ విజయం సాధించింది. ఐకమత్యమే మనబలం, సమిష్టి కృషియే మన ఘనవిజయం అనే స్లోగన్స్‌తో పోటీకి దిగిన అమ్మిరాజు ప్యానల్‌ మిగతా రెండు ప్యానల్స్‌ కంటే అత్యధిక మెజార్జీ సంపాదించి యూనియన్‌ని హస్తగతం చేసుకుంది. ఈ ఎన్నికలు హైద్రాబాద్‌, ఫిలిం చాంబర్‌, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ హాల్‌లో ఆగస్ట్‌ 13 ఆదివారం జరిగాయి. ఈ విజయంతో తెలుగు సినీ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శిగా ఆర్‌. వెంకటేశ్వరరావు(బందరుబాబి), ప్రెసిడెంట్‌గా అమ్మిరాజు కానుమిల్లి, కోశాధికారిగా కె. సతీష్‌ (గీతాఆర్ట్స్‌) పదవీ బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ ప్యానల్‌ లోని డి.యోగానంద్‌, కుంపట్ల రాంబాబు(అంబికా) లు వైస్‌ ప్రెసిడెంట్స్‌గానూ, సూరపనేని కిషోర్‌, జి. నాగేశ్వరరావు జాయింట్‌ సెక్రటరీలు గానూ; బానయ్య.యం (బాను), సి.హెచ్‌. నాగమధులు ఆర్గనైజింగ్‌ సెక్రటరీలుగానూ; అంజయ్య. పి, బి.వి.వి సత్యనారాయణ, ఆకుల ఉమాశంకర్‌, జి.హరినాధ్‌(ప్రియమణి), కె. రమేష్‌వర్మ, కొర్రపాటి వెంకటరమణ, కె. సత్యశివకుమార్‌(గీతాఆర్ట్స్‌), యమ్‌. రామారావు(ఆర్కా రాము), ఐ. లక్ష్మణరావు లు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్స్‌గా విజయం సాధించారు.

 

Facebook Comments
Ammiraju panel grabs Telugu Cine Production Executives Union election

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: