Social News XYZ     

Paisa Vasool Stumper to be revealed on 28th July

 ఈ నెల 28 న 'పైసా వసూల్' స్టంపర్ రిలీజ్

Paisa Vasool Stumper to be revealed on 28th July

నందమూరి బాలకృష్ణ - పూరి జగన్నాథ్ ల  సెన్సేషనల్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'పైసా వసూల్' . భవ్య క్రియేషన్స్పతాకం పై వి. ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ  సినిమా షూటింగ్పూర్తయి , ప్రస్తుతం ప్యాచ్ వర్క్ జరుపుకుంటోంది .అది కూడా ఈ వారంలోనే పూర్తి కానుంది .  ఈ నెల 28 న 'పైసా వసూల్' కి సంబంధించిన 'స్టంపర్'ని విడుదల చేయనున్నారు.

 

ఈ సందర్భం గాదర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ - "నందమూరి బాలకృష్ణ తో కలిసి ఫస్ట్ టైమ్ఈ సినిమా చేస్తున్నందుకు చాలా హ్యాపీ గానూ, గర్వం గానూ ఉంది.నా కెరీర్ లోనే ఇదొక మెమొరబుల్ మూవీ అవుతుంది. బాలకృష్ణ గారు ఈ పాత్ర లో లీనమైనతీరు చూసి వండర్ అయిపోయాను. నందమూరి అభిమానులు కోరుకొనే అంశాలన్నీ ఇందులోపుష్కలంగా ఉంటాయి. డైలాగ్స్, సాంగ్స్ అదిరిపోయేలెవెల్ లో ఉంటాయి. ఈ సినిమా ఎలా ఉండబోతోందో రేపు 28 న విడుదల కానున్న 'స్టంపర్' చూస్తే అర్థమవుతుంది. రెగ్యులర్ గా అందరూ విడుదల చేసే టీజర్ , ట్రైలర్ కి పూర్తి భిన్నం  గా ఈ 'స్టంపర్'ఉంటుంది" అని చెప్పారు.

నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ- " బాలకృష్ణ -పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ లో సినిమా చేసే అవకాశం వచ్చినందుకుచాలా గర్వం గా ఫీల్ అవుతున్నాను . మా భవ్య క్రియేషన్స్ సంస్థ ప్రతిష్టను నెక్స్ట్లెవెల్ కి తీసుకెళ్లే సినిమా అవుతుంది. ఈ వారం తో ప్యాచ్ వర్క్  కంప్లీట్ అవుతుంది.  డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తికావొచ్చాయి  . మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ కూడా చురుగ్గా సాగుతూ ,తుది దశకు చేరుకుంటోంది . ఆడియో ఫంక్షన్ నిత్వరలోనే గ్రాండ్ గా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. #NBK101Fever Begins పేరుతో బాలకృష్ణ గారు ఇప్పటివరకూ నటించిన 100 సినిమాల విశేషాల తో ఒక వీడియో కర్టెన్ రైజర్ రిలీజ్ చేసాం . అదిసోషల్ మీడియా లో ఇండియా లెవెల్ లో బాగా ట్రెండింగ్ అవుతోంది. " అని తెలిపారు. శ్రీయ  , ముస్కాన్ , కైరా దత్,అలీ,పృథ్వి ,పవిత్రా లోకేష్ ,విక్రమ్ జిత్  తదితరులు నటించిన ఈ చిత్రం లో ప్రముఖ హాలీవుడ్ -బాలీవుడ్ నటుడుకబీర్ బేడీ ఒక ప్రత్యేక పాత్ర ధరించారు .  ఈ చిత్రానికిసంగీతం: అనూప్ రూబెన్స్.

Facebook Comments
Paisa Vasool Stumper to be revealed on 28th July

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: