Social News XYZ     

I am very luck in every aspect of Vaishakam: Hero Harish (Interview)

'వైశాఖం' చిత్రానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ నేను చాలా లక్కీ
- హీరో హరీష్‌

I am very luck in every aspect of Vaishakam: Hero Harish (Interview)

ఆర్‌.జె. సినిమాస్‌ బేనర్‌పై డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి.దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'వైశాఖం'. హరీష్‌, అవంతిక జంటగా రూపొందిన ఈ చిత్రం జూలై 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో హీరో హరీష్‌తో జరిపిన ఇంటర్వ్యూ.

 

'వైశాఖం' ఈ నెల 21న రిలీజ్‌ అవుతోంది. మీకెలా అనిపిస్తోంది?
- ఈ సినిమా మీద చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. ప్రేక్షకులు 'వైశాఖం' చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురుచూస్తున్నారు. జూలై 21న మా సినిమా రిలీజ్‌ అవుతోంది. చాలా ఆనందంగా వుంది. సోలో హీరోగా ఇది మొదటి సినిమా. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. నేను కొత్తవాడినైనప్పటికీ అందరూ ఎంతో బాగా సపోర్ట్‌ చేస్తున్నారు. సినిమా రిలీజ్‌ అవ్వకముందే హరీష్‌ అనే ఓ కొత్త హీరో వస్తున్నాడని అందరికీ తెలిసింది. ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన రాజుగారికి, జయగారికి చాలా చాలా థాంక్స్‌. కొత్తగా వచ్చేవారు ఒక మంచి ఫ్లాట్‌ఫామ్‌ వుంటే బాగుంటుందనుకుంటారు. కానీ, అందరికీ అది దొరకదు. 2017లో ఈ బేనర్‌లో ఇంత మంచి సినిమా చెయ్యడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను.

సినిమా ఎలా వుండబోతోంది?
- ఒక సినిమాగా కాకుండా నిజ జీవితాన్ని చూస్తున్న ఫీలింగ్‌ అందరికీ కలుగుతుంది. ఈ సినిమాలోని సిట్యుయేషన్‌ మనకు జరగకపోయినా, మనకు తెలిసిన వారికి జరిగింది అనేది వింటూ వుంటాం. నిజ జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమా చేయడం జరిగింది. చాలా స్ట్రాంగ్‌ కథ. ఈ సినిమాకి అన్నీ బాగా కుదిరాయి. సినిమా ఇంత బాగా వచ్చిందంటే దానికి కారణం రాజుగారు. ముందుగా ఆయనకి థాంక్స్‌ చెప్పాలి.

మీ నేపథ్యం?
- మాది భీమవరం. సినిమాలంటే చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్‌. అయితే మాకు ఇండస్ట్రీలో ఎవరూ గాడ్‌ఫాదర్‌ లేరు. కరెక్ట్‌ ఫ్లాట్‌ఫామ్‌ దొరికి ఒక మంచి సినిమా చేస్తేగానీ ఇండస్ట్రీలో వుండలేమన్న గట్టి నమ్మకం కలిగింది. అలా వెయిట్‌ చేస్తున్న టైమ్‌లో 'వైశాఖం' చిత్రం చేసే అవకాశం వచ్చింది.

'వైశాఖం'లో హీరోగా ఛాన్స్‌ ఎలా వచ్చింది?
- అందరిలాగే నేను కూడా సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న టైమ్‌లో జయగారు కొత్తవారితో ఓ సినిమా చెయ్యబోతున్నారని తెలిసింది. అయితే అప్పటికి కొత్తవారితో చెయ్యాలా లేక ఆల్రెడీ వున్న వారితో చెయ్యాలా అనేది ఇంకా డిసైడ్‌ అవ్వలేదు. నేను వెళ్ళి మేడమ్‌గారిని కలిసి వచ్చాను. నాకు కాల్‌ చేస్తానని చెప్పారు. దాదాపు నెలన్నర తర్వాత కాల్‌ చేసి ఆఫీస్‌కి రమ్మని పిలిచారు. కొత్తవారితో సినిమా చెయ్యాలనుకుంటున్నాము. అందులో నువ్వు ముందు వున్నావు అని చెప్పారు. మా స్టోరీకి, మేం అనుకున్న క్యారెక్టర్‌కి నువ్వు సరిపోతావని అనుకుంటున్నామని చెప్పారు.

ఇందులో మీ క్యారెక్టర్‌ ఎలా వుంటుంది?
- ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ పక్కింటి అబ్బాయిలా వుంటుంది. ప్రతి ఒక్కరూ సొంత మనిషిలా ఓన్‌ చేసుకుంటారు. మంచి ఏటిట్యూడ్‌ వున్న క్యారెక్టర్‌, మెచ్యూర్డ్‌ క్యారెక్టర్‌. అన్నీ మిక్స్‌ అయి వున్న క్యారెక్టర్‌.

కథ వినగానే మీకేమనిపించింది?
- మొదట మేడమ్‌గారు నాకు కథ చెప్పలేదు. ఫస్ట్‌ చెప్పింది టైటిల్‌. 'వైశాఖం' అనే టైటిల్‌ ఎప్పుడు చెప్పారో అప్పుడే నేను కనెక్ట్‌ అయిపోయాను. టైటిల్‌ వినగానే అందరికీ ఒక పాజిటివ్‌ ఫీలింగ్‌ కలుగుతుంది. ఆ తర్వాత స్టోరీ చెప్పారు. కథలోని ప్రతి ఎలిమెంట్‌కి, ప్రతి సీన్‌కి కనెక్ట్‌ అయ్యాను. నాలాగే ఆడియన్స్‌ కూడా కనెక్ట్‌ అవుతారని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పగలను.

స్టార్‌ హీరోల వినైల్స్‌ మధ్యలో మీ వినైల్‌ కూడా కనిపించినపుడు మీరెలా ఫీల్‌ అయ్యారు?
- చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్‌లో వున్నాను. మనం పెట్టుకున్న గోల్‌కి రీచ్‌ అవుతామో లేదో తెలీదు కానీ హార్డ్‌ వర్క్‌ చేస్తూ వచ్చాను. ఫిలింనగర్‌లో 'వైశాఖం' సినిమాకి సంబంధించిన పెద్ద పోస్టర్‌ పెట్టారు. ఆ పోస్టర్‌లో నన్ను నేను చూసుకుని పదేళ్ళ క్రితం మన డ్రీమ్‌ ఏమిటి? అనుకున్నది ఎచీవ్‌ అయ్యానా లేదా అనేది పక్కన పెట్టి ఆ పోస్టర్‌ వైపే చూస్తూ వుండిపోయాను. ఆ పోస్టర్‌ని ఫోటో తీసి అమ్మ, నాన్నకి పంపించాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యారు.

సినిమాల్లో నటించాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది?
- డాన్స్‌ దగ్గర నుంచి నాకు యాక్టింగ్‌పైన ఇంట్రెస్ట్‌ వచ్చింది. స్కూల్‌ డేస్‌ నుంచే నేను మంచి డాన్సర్‌ని. మా సిస్టర్‌ దగ్గర నుంచి ఆ డాన్స్‌ వచ్చింది. స్కూల్‌లో స్టేజ్‌ మీద చేశాను. ఆ తర్వాత కొన్ని స్టేజ్‌ షోలు కూడా చేశాను. అది సినిమాల్లోకి వచ్చిన తర్వాత బాగా హెల్ప్‌ అయింది. 'వైశాఖం'లోని పాటలన్నీ ఇంత బాగా వచ్చాయంటే దానికి కారణం శేఖర్‌ మాస్టర్‌గారు. సినిమాటిక్‌ డాన్స్‌ కోసం 20 రోజులపాటు ట్రైనింగ్‌ ఇప్పించారు మేడమ్‌గారు. ఈ సినిమా పాటలు చూసిన ప్రతి ఒక్కరూ డాన్స్‌ బాగా చేశావని అప్రిషియేట్‌ చేశారు.

లేడీ డైరెక్టర్‌తో వర్క్‌ చేయడం ఎలా అనిపించింది?
- జెనర్‌లో మార్పు వుంటుంది తప్ప డైరెక్షన్‌ అనేది ఒక్కటే. ఒక డైరెక్టర్‌తో వర్క్‌ చేస్తున్నామనే ఫీలింగ్‌ తప్ప జెనర్‌ ఏది ఆలోచన రాదు. కొన్ని విషయాల్లో లేడీస్‌ మనతో చెప్పలేరు, మనం లేడీస్‌తో చెప్పలేం. చిన్న చిన్న ఇబ్బందులు కలిగినపుడు బిహైండ్‌ ద కెమెరా షీ ఈజ్‌ లైక్‌ మదర్‌. కొడుక్కి ఏం కావాలి అనేది గ్రహించేవారు. నాకే కాదు టీమ్‌ అందరికీ.

పాటల కోసం కజక్‌స్థాన్‌ వెళ్ళడం, బడ్జెట్‌ పెరుగుతూ వెళ్ళడం చూసి మీరు ఏమనుకున్నారు?
- కొత్తవారితో సినిమా అంటే లిమిటెడ్‌ బడ్జెట్‌లోనే చేస్తారని అనుకునేవాడిని. కానీ, 'వైశాఖం' సినిమా స్టార్ట్‌ అయ్యిందో బడ్జెట్‌ పెరుగుతూ వెళ్తోంది. రాజుగారు ఈ కథని అంతగా నమ్మారు. జయగారితో ఆయనకు వున్న బాండింగ్‌ వల్ల తప్పకుండా సినిమా బాగా వస్తుందన్న కాన్ఫిడెన్స్‌తో బడ్జెట్‌ గురించి ఆలోచించలేదు. మా మీద అంత బడ్జెట్‌ పెట్టడం అనేది మా లక్‌ అనే చెప్పాలి. ఇది చాలా చాలా గ్రేట్‌. మా ఫస్ట్‌ సినిమాకే ఎబ్రాడ్‌ వెళ్తున్నామని చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాం. ఎబ్రాడ్‌ అంటే బ్యాంకాక్‌, సింగపూర్‌, మలేషియా వంటి దేశాలకు వెళ్తాం అనుకున్నాను. ఎవరూ షూట్‌ చెయ్యని లొకేషన్స్‌లో మనం సాంగ్స్‌ తియ్యాలి అని మేడమ్‌ చెప్పినపుడు నాకు అర్థం కాలేదు. కజక్‌స్తాన్‌ వెళ్తున్నాము అని చెప్పారు. కజక్‌స్తాన్‌ అనేది బ్యూటీఫుల్‌ సిటీ. దుబాయ్‌ కంటే బాగుంటుంది.

సినిమాకి సంబంధించి మీకు వచ్చిన అప్రిషియేషన్‌?
- ఫస్ట్‌ టైటిల్‌కి మంచి అప్రిషియేషన్‌ వచ్చింది. ఆడియో రిలీజ్‌ అయిన తర్వాత 'నీకు ఈ సాంగ్స్‌ చాలా ఎక్కువ' అని నా ఫ్రెండ్స్‌ అన్నారు. అంటే పాటలు అంత అద్భుతంగా వచ్చాయి. అన్ని జోనర్‌ సాంగ్స్‌ ఇందులో వున్నాయి. మాస్‌ సాంగ్‌, థీమ్‌ సాంగ్‌, రొమాంటిక్‌ సాంగ్‌...ఇలా అన్నీ ఈ ఆడియోలో వున్నాయి. పాటలన్నీ చాలా పెద్ద హిట్‌ అయ్యాయి.

'వైశాఖం' ఆడియో ఫంక్షన్‌కి మహేష్‌ రావడం మీకెలా అనిపించింది?
- చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. ఎప్పుడూ స్క్రీన్‌ మీద చూడడమే కదా. ఈ ఫంక్షన్‌లో దగ్గరగా చూడగలిగాను. అలాంటి హీరోలు మా డ్రీమ్‌ స్టార్స్‌. మా సినిమా ఫంక్షన్‌కి వచ్చి మమ్మల్ని బ్లెస్‌ చేయడం మా అదృష్టం.

నిర్మాత బి.ఎ.రాజు గురించి?
- ప్రొడ్యూసర్స్‌లో వెరీ కూలెస్ట్‌ పర్సన్‌. మీ అందరికీ కావాల్సిన వ్యక్తి. ఇప్పుడు ఈ సినిమాతో మా అందరికీ కావాల్సిన వ్యక్తి. చాలా తక్కువ మాట్లాడతారు. ఆయన్ని చూసినపుడు ఇంత ఖర్చు పెడతారనుకోలేదు. సినిమాని ఇంత రిచ్‌గా తీసిన రాజుగారికి థాంక్స్‌.

ఈ సినిమాలో సీనియర్‌ ఆర్టిస్టుల సపోర్ట్‌ ఎలా వుంది?
- సీనియర్‌ యాక్టర్స్‌ చాలా మంది వున్నారు. సాయికుమార్‌గారు, పృథ్వీగారు, కాశీవిశ్వనాథ్‌గారు, రమాప్రభగారితో కలిసి పనిచేయడం చాలా ఆనందం కలిగించింది. వాళ్ళంతా చాలా హెల్ప్‌ చేశారు. మమ్మల్ని ఎంకరేజ్‌ చేశారు.

మీ నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌?
- సెప్టెంబర్‌లో ఆర్‌.జె.సినిమాస్‌ బేనర్‌లోనే రాజుగారు నిర్మాతగా ఓ సినిమా చేస్తున్నాను. జనవరిలోగానీ, ఫిబ్రవరిలోగానీ ఆ సినిమా రిలీజ్‌ వుంటుంది అంటూ ఇంటర్వ్యూ ముగించారు 'వైశాఖం' హీరో హరీష్‌.

Facebook Comments
I am very luck in every aspect of Vaishakam: Hero Harish (Interview)

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: