Social News XYZ     

Sampoornesh Babu Starring “Virus” Audio Releasing on May 20th

ఈనెల 20న సంపూర్ణేష్ బాబు "వైరస్" ఆడియో విడుదల!

Sampoornesh Babu Starring "Virus" Audio Releasing on May 20th

సంపూర్ణేష్ బాబు టైటిల్ పాత్రలో ఎ.ఎస్.ఎన్ ఫిలిమ్స్ పతాకంపై ఎస్.ఆర్.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "వైరస్". "నో వేక్సిన్, ఓన్లీ టాక్సిన్" అనేది ట్యాగ్ లైన్. గీత్ షా కథానాయిక. సలీమ్.ఎం.డి-శ్రీనివాస్ వంగాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పుల్లరేవు రామచంద్రారెడ్డి సమర్పిస్తున్నారు. మీనాక్షీ భుజంగ్-సునీల్ కశ్యప్ ద్వయం సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రం ఆడియోను మే 20న విడుదల చేయనున్నారు.

 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సలీమ్.ఎం.డి మాట్లాడుతూ.. "హిలేరియస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన "వైరస్" సినిమా టీజర్ ను ఇటీవల విడుదల చేశాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈనెల 20న పాటల్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే చిత్రాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: మీనాక్షీ భుజంగ్-సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ: వి.జె, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, మాటలు: దుర్గాప్రసాద్ రాయుడు, నిర్మాతలు: సలీమ్.ఎం.డి-శ్రీనివాస్ వంగాల, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎస్.ఆర్.కృష్ణ!

Facebook Comments
Sampoornesh Babu Starring "Virus" Audio Releasing on May 20th

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: