Social News XYZ     

Devi Sri Prasad appreciates Vaishakham songs

'వైశాఖం' సాంగ్స్‌ నాకు బాగా నచ్చాయి - రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌

Devi Sri Prasad appreciates Vaishakham songs

ఆర్‌.జె.సినిమాస్‌ బేనర్‌పై డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి.దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'వైశాఖం'. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా రిలీజ్‌ చెయ్యాలని నిర్మాత బి.ఎ.రాజు ప్లాన్‌ చేస్తున్నారు. జయ బి., బి.ఎ.రాజు కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ప్రేమలో పావని కళ్యాణ్‌, చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్‌లీ చిత్రాలు మ్యూజికల్‌గా చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. వాటన్నింటినీ మించి 'వైశాఖం' చిత్రంలోని పాటలు అద్భుతంగా వున్నాయని ప్రముఖ సంగీత దర్శకుడు రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ ప్రశంసించారు.

 

'వైశాఖం' చిత్రంలోని పాటల్ని ప్రత్యేకంగా వీక్షించిన దేవిశ్రీప్రసాద్‌ మాట్లాడుతూ - ''హై! ది ఈజ్‌ దేవిశ్రీప్రసాద్‌. 'వైశాఖం' చిత్రంలోని పాటలు చూశాను. నాకు బాగా నచ్చాయి. కంగ్రాట్స్‌ టు మ్యూజిక్‌ డైరెక్టర్‌ డి.జె.వసంత్‌. ముఖ్యంగా పాటల పిక్చరైజేషన్‌ కూడా చాలా బాగా నచ్చింది. ఆడియో బ్లాక్‌ బస్టర్‌ అయి, సినిమా కూడా బ్లాక్‌ బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నాను. బి.ఎ.రాజుగారు ప్రొడ్యూస్‌ చేస్తున్న ఈ సినిమా పెద్ద బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది. ఆయన అందరికీ కావాల్సిన మనిషి, అందరికీ మిత్రుడు. అలాగే జయగారు మాకెంతో ఆత్మీయులు. పాటల్ని చాలా ఎక్స్‌ట్రార్డినరీగా తీశారు. ఈ సినిమా జయగారి కెరీర్‌లో చాలా పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను. హీరో హరీష్‌, హీరోయిన్‌ అవంతిక చాలా ఈజ్‌తో చేస్తున్నారు. ఇద్దరూ చాలా ఎనర్జీతో డాన్స్‌ చేశారు. ముఖ్యంగా లొకేషన్స్‌ అమేజింగ్‌గా వున్నాయి. ఇప్పటివరకు ఏ ఇండియన్‌ సినిమా షూట్‌ చెయ్యని కజక్‌స్తాన్‌లో ఈ చిత్రంలోని పాటలు తీశారు. అలాంటి రేర్‌ లొకేషన్స్‌ని స్క్రీన్‌పై చూడడం చాలా సంతోషం కలిగించింది. సినిమాటోగ్రాఫర్‌ వి.వి.సుబ్బారావుగారు మైండ్‌ బ్లోయింగ్‌గా విజువల్స్‌ షూట్‌ చేశారు, చాలా ఎక్స్‌ట్రార్డినరీ వర్క్‌ చేశారు. ఈ సినిమా పాటలు, సినిమా చాలా పెద్ద హిట్‌ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - ''ఎంతో బిజీగా వున్నప్పటికీ 'వైశాఖం' పాటలు చూసి మమ్మల్ని అభినందించిన దేవిశ్రీప్రసాద్‌గారికి థాంక్స్‌. ఆయన చెప్పినట్టుగానే పాటలు పెద్ద హిట్‌ అవుతాయని, సినిమా కూడా పెద్ద హిట్‌ అవుతుందని ఆశిస్తున్నాము'' అన్నారు.

హరీష్‌, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈశ్వరీరావు, రమాప్రభ, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, కృష్ణభగవాన్‌, శ్రీలక్ష్మీ, గుండు సుదర్శన్‌, అప్పారావు, శేషు, భద్రం, సొంపు, ఫణి, మాధవి, జెన్నీ, జబర్దస్త్‌ టీమ్‌ వెంకీ, శ్రీధర్‌, రాంప్రసాద్‌, ప్రసాద్‌, తేజ, శశాంక్‌, లతీష్‌, కీర్తి నాయుడు, పరమేశ్వరి, గోవిందరావు, వీరన్న చౌదరి, రాజా బొయిడి, లత సంగరాజు, లావణ్య, మోనిక, చాందిని, ఇషాని కళ్యాణి కామ్రే, షాజహాన్‌ సుజానే, తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: వాలిశెట్టి వెంకట సుబ్బారావు, సంగీతం: డి.జె.వసంత్‌, డాన్స్‌: వి.జె.శేఖర్‌, ఆర్ట్‌: మురళి కొండేటి, ఫైట్స్‌: వెంకట్‌, రామ్‌ సుంకర, స్టిల్స్‌: శ్రీను, కో-డైరెక్టర్‌: అమరనేని నరేష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సుబ్బారావు, లైన్‌ ప్రొడ్యూసర్‌: బి.శివకుమార్‌, నిర్మాత: బి.ఎ.రాజు, రచన, ఎడిటింగ్‌, దర్శకత్వం: జయ బి.

Facebook Comments
Devi Sri Prasad appreciates Vaishakham songs

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.