Social News XYZ     

Nithin-14 Reels movie titled Lie

యూత్‌స్టార్‌ నితిన్‌ బర్త్‌డే సందర్భంగా హను రాఘవపూడి, 14 రీల్స్‌ భారీ చిత్రం 'లై' ఫస్ట్‌ లుక్‌ విడుదల

Nithin-14 Reels movie titled Lie

యూత్‌స్టార్‌ నితిన్‌ కథానాయకుడిగా వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రానికి 'లై' (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి) టైటిల్‌ని కన్‌ఫర్మ్‌ చేశారు. మార్చి 30 హీరో నితిన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

 

ఈ సందర్భంగా నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర మాట్లాడుతూ - ''ఈరోజు మా హీరో నితిన్‌ పుట్టినరోజు సందర్భంగా 'లై' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాం. హైదరాబాద్‌లో ఆల్రెడీ ఈ చిత్రానికి సంబంధించి ఓ భారీ షెడ్యూల్‌ జరిగింది. ఏప్రిల్‌ 4న అమెరికా షెడ్యూల్‌ ప్రారంభమవుతుంది. జూన్‌ రెండో వారం వరకు సాగే ఈ షెడ్యూల్‌లో వెగాస్‌, లాస్‌ ఏంజిలిస్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, చికాగో వంటి అందమైన లొకేషన్స్‌లో షూటింగ్‌ జరుగుతుంది. దీంతో 90 శాతం షూటింగ్‌ పూర్తవుతుంది. ఆగస్ట్‌ 11న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం. కృష్ణగాడి వీరప్రేమగాథ తర్వాత హను రాఘవపూడి కాంబినేషన్‌లో నితిన్‌ హీరోగా చేస్తున్న ఈ సినిమా మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది'' అన్నారు.

యూత్‌స్టార్‌ నితిన్‌, మేఘా ఆకాష్‌, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, శ్రీరామ్‌, రవికిషన్‌, పృథ్వీ, బ్రహ్మాజీ, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్‌, సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, డాన్స్‌: రాజు సుందరం, ఫైట్స్‌: కిచ్చా, పాటలు: కృష్ణకాంత్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.

Facebook Comments
Nithin-14 Reels movie titled Lie

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: