Social News XYZ     

Angel movie in 4th schedule

నాల్గోవ షెడ్యూల్ లో బిజీగా ఉన్న “ఏంజెల్”

Angel movie in 4th schedule

మన్యంపులి వంటి సూపర్ హిట్ తరువాత శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సోషియోఫాంటసీ ఎంటర్ టైనర్ ఏంజెల్. గతేడాది షూటింగ్ మొదలుపెట్టిన ఈ చిత్ర యూనిట్ ఇప్పటికే మూడు షెడ్యూల్స్ దిగ్విజయంగా పూర్తిచేసుకొని తాజాగా జనవరి 16 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నాల్గోవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. యంగ్ టాలెండ్ హీరో నాగఅన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి దర్శకధరీడు రాజమౌళి అసోసియేట్ బాహుబలి పళని దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ప్రస్తుతం జరుగుతోన్న షెడ్యూల్ ని జనవరి నెలాఖరు వరకు నిర్విహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ఈ చిత్ర నిర్మాత భువన్ సాగర్ తెలిపారు.

 

ఈ సినిమాలో సప్తగిరి, ప్రదీప్ రావత్, షియాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. బెంగాల్ టైగర్ ఫేమ్ భీమ్స్ సెస్సరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ముప్పా వెంగయ్య చౌదరి సమర్పణలో సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై భువన్ సాగర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రచన : శ్రీనివాస్ లంకపల్లి, ఆర్ట్‌: వి.ఎస్. సాయిమణి, స్టంట్స్‌: రామ్ లక్ష్మణ్, డైలాగ్స్‌: వేంపల్లి రమేశ్ రెడ్డి, ఎడిటర్‌: చోట.కె.ప్రసాద్, సినిమాటోగ్రఫీ: గుణ.

Facebook Comments
Angel movie in 4th schedule

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: