Social News XYZ     

Head Constable Venkataramaya Audio Launched

హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య ఆడియో రిలీజ్..!

Head Constable Venkataramaya Audio Launched

ఆర్.నారాయ‌ణ‌మూర్తి, జ‌య‌సుధ జంట‌గా తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో
శ్రీమ‌తి చ‌ద‌ల‌వాడి ప‌ద్మావ‌తి నిర్మించిన చిత్రం హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌. ఈ చిత్రం ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మం ప్ర‌సాద్ ల్యాబ్ లో జ‌రిగింది. ఆడియో సీడీని ఎస్.పి.నాయ‌క్ ఆవిష్క‌రించి తొలి సీడీను జ‌య‌సుధ‌కు అంద‌చేసారు.

ఈ సంద‌ర్భంగా జ‌య‌సుధ మాట్లాడుతూ...ఆడియో ఫంక్ష‌న్ అంటే ఎప్పుడు ఈ ఫంక్ష‌న్ అవుతుందా అనిపిస్తుంటుంది. ఈ ఆడియో ఫంక్ష‌న్ రెండు గంట‌లు అయినా ఆర్.నారాయ‌ణ‌మూర్తి గారు అప్పుడే అయిపోయిందా అనేట్టుగా యాంక‌రింగ్ చేసారు. టైమ్ తెలియ‌లేదు. చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు గారు ఫోన్ చేసి ఈ క‌థ చెప్పి హీరోయిన్ గా చేయాలి అన్నారు. మా పాత నిర్మాత కాబ‌ట్టి ఫోన్ లో క‌థ అర్ధం కాక‌పోయినా ఓకే అనేసాను. షూటింగ్ కి వ‌చ్చిన త‌ర్వాత హీరోయిన్ కు ప‌దేళ్ల పాప అని తెలిసి భ‌య‌మేసింది. ఈ క్యారెక్ట‌ర్ కు నేను సూట్ అవుతానా అనిపించింది. ఈ చిత్రంలో నారాయ‌ణ‌మూర్తికి నాకు ఓ పాట కూడా ఉంది. ఆ పాట‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా సంక్రాంతికి పెద్ద సినిమాల మ‌ధ్య రిలీజ్ అవుతుంది. స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

 

ద‌ర్శ‌క‌నిర్మాత చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు మాట్లాడుతూ....మా బ్యాన‌ర్ ను స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు గారు ప్రారంభించారు. నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి రామోజీరావు గారు క్లాప్ కొట్టారు. మా నారాయ‌ణ‌మూర్తి, జ‌య‌సుధ జంట‌గా న‌టించారు. స్టూడెంట్స్ లా నేను చెప్పిన‌ట్టుగా నారాయ‌ణ‌మూర్తి, జ‌య‌సుధ న‌టించారు. వంద‌శాతం తృప్తిగా వ‌చ్చింది. సోసైటికి ఉప‌యోగ‌ప‌డే చిత్రం ఇది అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో చ‌ద‌ల‌వాడ తిరుప‌తిరావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Facebook Comments
Head Constable Venkataramaya Audio Launched

About Doraiah Vundavally

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Advertisements
%d bloggers like this: