Social News XYZ     

Minister Harish Rao released “Iddari Madhya 18” movie poster

మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా 'ఇద్దరి మధ్య 18' పోస్టర్‌ విడుదల

Minister Harish Rao released "Iddari Madhya 18" movie poster

ఎస్‌.ఆర్‌.పి విజువల్‌ పతాకంపై సాయితేజ పాటిల్‌ సమర్పణలో రాంకార్తీక్‌, భానుత్రిపాత్రి జంటగా బిత్తిరిసత్తి ప్రధానపాత్రలో నాని ఆచార్య దర్శకత్వంలో శివరాజ్‌ పాటిల్‌ నిర్మించిన మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రం 'ఇద్దరి మధ్య 18'. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని తెలంగాణ మంత్రి వర్యులు హరీష్‌రావు హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత శివరాజ్‌ పాటిల్‌, దర్శకుడు నాని ఆచార్య, సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ, చిత్ర కథానాయకుడు రాంకార్తీక్‌, కథానాయిక భానుత్రిపాత్రి, బిత్తిరిసత్తి, కెమెరామెన్‌ జిఎల్‌. బాబు తదితరులు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా మంత్రి వర్యులు హరీష్‌రావు మాట్లాడుతూ..'రాజకీయాలలో పేరొందిన శివరాజ్‌ పాటిల్‌ ఈ చిత్రం ద్వారా సినీ రంగంలో కూడా మంచి పేరు పొందాలని, సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను..' అన్నారు.

చిత్ర నిర్మాత శివరాజ్‌ పాటిల్‌ మాట్లాడుతూ..మా చిత్ర పోస్టర్‌ ఆవిష్కరించిన తెలంగాణ మంత్రి వర్యులు హరీష్‌రావుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అన్ని కమర్షియల్‌ హంగులతో ఈ చిత్రాన్ని యూత్‌ని ఆట్టుకునే అంశంతో, ఒక చక్కని మెసేజ్‌తో ఈ చిత్రాన్ని దర్శకుడు నాని ఆచార్య తెరకెక్కించారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో ఆడియోని విడుదల చేసి, డిశంబర్‌ నెలాఖరుకి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాము..అన్నారు.

రాంకార్తీక్‌, భానుత్రిపాత్రి, బిత్తిరిసత్తి, రవిప్రకాష్‌, శివన్నారాయణ, బాబీలహరి, జబర్ధస్త్‌ కు చెందిన రఘు, రాము, అప్పారావు, చిట్టిబాబు, చమ్మక్‌చంద్ర మొదలగువారు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ, ఎడిటింగ్‌: మార్తాండ్‌. కె. వెంకటేష్‌, కెమెరా: జిఎల్‌.బాబు, కొరియోగ్రఫీ: నిక్సన్‌ డిక్రూజ్‌, భాను, గణేష్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, పాటలు: కందికొండ, వరికుప్పల యాదగిరి, రామ్‌ పైడిశెట్టి, చిలుకరెక్క గణేష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శివకుమార్‌, కో-డైరెక్టర్‌: జి. భూపతి, సమర్పణ: సాయితేజ పాటిల్‌, నిర్మాత: శివరాజ్‌ పాటిల్‌, స్టోరీ, డైరెక్షన్‌: నాని ఆచార్య.

Facebook Comments

%d bloggers like this: