Social News XYZ     

Nandamuri Balakrishna’s condolence message on the demise of Amma Jayalalithaa

జ‌య‌ల‌లిత‌గారి మ‌ర‌ణం తీర‌ని లోటు - నంద‌మూరి బాల‌కృష్ణ‌

Nandamuri Balakrishna's condolence message on the demise of Amma Jayalalithaa

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌గారి మ‌ర‌ణ‌వార్త న‌న్నెంతో క‌లిచి వేసింది. సినిమా రంగం, రాజ‌కీయాల్లో జ‌య‌ల‌లిత‌గారు త‌న‌దైన‌ ముద్ర వేశారు. నాన్న‌గారితో కూడా ఎన్నో సినిమాల్లో క‌లిసి న‌టించిన జ‌య‌ల‌లితగారు సినిమా రంగంలో త‌న‌దైన ముద్ర వేశారు. అలాగే అనేక స‌వాళ్ల‌తో కూడిన రాజ‌కీయాల్లో కూడా ముఖ్య‌మంత్రిగా ఆరు సార్లు ఎన్నిక కావ‌డం చాలా గొప్ప విష‌యం. ఎంతో మంది మ‌హిళ‌ల‌కు, పోరాట శ‌క్తికి ఆమె నిద‌ర్శ‌నం. ఇటు వంటి లీడ‌ర్స్ అరుదుగా ఉంటారు. ఇటువంటి గొప్ప నాయ‌కురాలు మ‌న‌ల్ని విడిచిపెట్టి అనంత లోకాల‌కు వెళ్ల‌డం ఎంతో బాధాక‌రం. జ‌య‌ల‌లిత‌గారి మ‌ర‌ణం సినీ రంగానికే కాదు, రాజ‌కీయ రంగానికి కూడా తీర‌ని లోటు. ఆమె ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ఆ భ‌గ‌వంతుని ప్రార్థిస్తున్నాను.

 

Facebook Comments