Social News XYZ     

Araku Road Lo to release on December 2nd

Araku Road Lo to release on December 2nd

రాం శంక‌ర్‌, నికిషా ప‌టేల్ జంట‌గా శేషాద్రి క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందిన చిత్రం అర‌కు రోడ్ లో. వాసుదేవ్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రానికి మేకా బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, బి.భాస్క‌ర్‌, వేగిరాజు ప్ర‌సాద రాజు, రామేశ్వ‌రి న‌క్కా లు నిర్మాతలు. ఈ చిత్రం నిర్మాణాంతర కార్య క్రమాలన్ని పూర్తి చేసుకుని డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది .

ఈ సందర్భం గా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ఇటీవల"మా చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాద్ గారు ,మరియు ఇతర సినీ ప్రముఖులు ప్రసాద్ ల్యాబ్ లో చూడడం జరిగింది . సినిమా చూసివారందరూ మెచ్చుకోవడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది . అలాగే ప్రభాస్ గారు విడుదల చేసిన సాంగ్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది .30 ఇయర్స్ పృద్వి చేసిన రిస్క్ రసూల్ క్యారక్టర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని చెప్పారు . ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 2 న అత్యధిక ధియేటర్ లలో రిలీజ్ చేయనున్నాము అని అన్నారు .

 

రాం శంక‌ర్‌, నికిషా ప‌టేల్, కమల్ కామరాజు, అభిమన్యు సింగ్, కోవై సరళ, థర్టీ ఇయర్స్ పృథ్వి, కృష్ణ భగవాన్, రఘు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్, సంగీతం : రాహుల్ రాజ్, వాసుదేవ్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జగదీశ్ చీకటి, నిర్మాతలు : మేకా బాలసుబ్రహ్మణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాద రాజు, రామేశ్వరి నక్కా; రచన, దర్శకత్వం : వాసుదేవ్

Facebook Comments