Social News XYZ     

Extremely confident of Sahasam Swasaga Sagipo : Producer Miryala Ravinder Reddy

`సాహ‌సం శ్వాస‌గా సాగిపో` సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం - నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి

Extremely confident of Sahasam Swasaga Sagipo : Producer Miryala Ravinder Reddy

నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మరో విభిన్న కథా చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపోస‌. మిర్యా ల‌స‌త్య‌నారాయ‌ణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌ బేనర్‌పై గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను న‌వంబ‌ర్ 11న విడుద‌ల కానుంది.సంద‌ర్భంగా నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డితో సినిమా గురించిన విశేషాల‌ను తెలియ‌జేశారు.. నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ - ``'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా చాలా బాగా వచ్చింది. రెహమాన్‌గారి మ్యూజిక్‌తో గౌతమ్‌మీనన్‌గారి స్టయిల్లో సినిమా బాగా వచ్చింది. సినిమా కొన్ని సాంకేతిక కారణాల కారణంగా కొంత ఆలస్యమైన మాట నిజమే అయితే సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం..త‌ప్ప‌కుండా  ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ఫస్టాప్‌ అంతా బ్యూటీఫుల్‌లవ్‌స్టోరీ, సెకండాఫ్‌ యాక్షన్‌ పార్ట్‌తో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. చైతన్య ప్రేమమ్‌ హిట్‌ తర్వాత 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా విడుదలవుతుండటం చాలా మంచిదయ్యింది. మా సినిమాకు ప్రేమమ్‌ సక్సెస్‌ బాగా హెల్ప్‌ అవుతుంది. హీరో హీరోయిన్‌ మధ్య ఉండే ప్రేమకు ఓ సమస్య వస్తుంది, ఆ సమస్య కోసం హీరో ఎలాంటి సాహసం చేశాడనేదే మా సినిమా. డైరెక్టర్‌ శ్రీవాస్‌గారితో నాకు మంచి అనుబంధం ఉంది. దానివల్ల నేను ఆయన్ను ఓ సినిమా గురించి తరుచూ కలిసే వాడిని, అప్పుడు డిక్టేటర్‌ సినిమా షూటింగ్‌ జరుగుతుంది. ఆ సమయంలో నేను అక్కడ కోనవెంకట్‌గారిని కలిశాను. గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రెహమాన్‌ మ్యూజిక్‌ డైరెక్షన్‌లో రానున్న సాహసం శ్వాసగా సాగిపో సినిమా గురించి చెప్పారు.

'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా అలా కుదిరింది. మా కుటుంబ సభ్యులంతా వ్యాపారాల్లో స్థిరపడ్డవారే. నాకు సినిమా అంటే ఆసక్తి అనడం కంటే ఒకింత ఎక్కువే ఇష్టం ఉండేది. దాంతో దర్శకుడు కావాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి వచ్చి కొంతకాలం అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కూడా వర్క్‌ చేసిన తర్వాత నిర్మాతగా మారాను. నాకు మెగాపవర్‌స్టార్‌ రాంచరణ్‌తో సినిమా చేయాలనే కోరిక ఉంది. ఆయ‌న అవ‌కాశం ఇస్తే త‌ప్ప‌కుండా రాంచ‌ర‌ణ్‌గారితో సినిమా చేస్తాను. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బోయపాటిగారి దర్శకత్వంలో రూపొంద‌నున్న సినిమా ఈ నవంబర్‌ 16 నుండి రెగ్యులర్‌ చిత్రీకరణ జరుపుకుంటుంది. అలాగే ఫిభ్రవరిలో గోపీచంద్‌తో సినిమా ఉంటుంది. విజయ్‌ ఆంటోని నటించిన యెమన్‌ సినిమాను తెలుగులో విడుదల చేయబోతున్నాం. అలాగే ఈట్టి అనే తమిళ సినిమా రీమేక్‌ హక్కులు కూడా తీసుకున్నాం. ఈ సినిమాను రీమేక్‌ చేయాలా లేక అనువాదం చేయాలా అని ఆలోచిస్తున్నాం. ఇక సాహసం శ్వాసగా సాగిపో సినిమా ఆడియో పెద్ద హిట్‌ అయ్యింది. సినిమాను కూడా పెద్ద హిట్‌ చేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

 

Facebook Comments