Social News XYZ     

Dharma Yogi censored, release on October 28th

'ధర్మయోగి' సెన్సార్‌ పూర్తి - అక్టోబర్‌ 28 విడుదల

Dharma Yogi censored, release on October 28th

యంగ్‌ హీరో ధనుష్‌ మొదటిసారి ద్విపాత్రాభినయంలో, త్రిష, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా శ్రీమతి జగన్‌మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో సి.హెచ్‌.సతీష్‌కుమార్‌ నిర్మాతగా రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ధర్మయోగి'. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని 'యు' సర్టిఫికెట్‌ పొందింది. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్‌ 28న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ - ''మా చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని 'యు' సర్టిఫికెట్‌ పొందింది. చిత్రాన్ని చూసిన సెన్సార్‌ సభ్యులు 'ధర్మయోగి' కుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కని ఎంటర్‌టైనర్‌ అని ప్రశంసించారు. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో ధనుష్‌ కెరీర్‌లోనే ఓ డిఫరెంట్‌ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్‌ 28న విడుదల చేస్తున్నాం. ఆల్రెడీ ఈ చిత్రంలోని పాటలు చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. ఆడియన్స్‌లో ధనుష్‌కి వున్న ఫాలోయింగ్‌ గురించి అందరికీ తెలిసిందే. వారి ఎక్స్‌పెక్టేషన్స్‌ రీచ్‌ అయ్యే విధంగా ఈ చిత్రం రూపొందింది. తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్‌ 28న విడుదలవుతున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించి మా బేనర్‌కి మంచి పేరు తెస్తుందన్న నమ్మకం నాకు వుంది'' అన్నారు.

 

ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా, తమిళ్‌ స్టార్‌ హీరో విజయ్‌ తండ్రి ఎస్‌.ఎ.చంద్రశేఖర్‌ ఓ ప్రత్యేక పాత్రను చేయడం విశేషం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌లో భాగంగా పాటల రికార్డింగ్‌, డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. '' అన్నారు.

ధనుష్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా ఎస్‌.ఎ.చంద్రశేఖర్‌ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: వెంకటేష్‌ ఎస్‌., ఎడిటింగ్‌: ప్రకాష్‌ మబ్బు, సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, సమర్పణ: శ్రీమతి జగన్మోహిని, నిర్మాత: సి.హెచ్‌.సతీష్‌కుమార్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌.

Facebook Comments

%d bloggers like this: