Social News XYZ     

Metro completes 50 percent Shoot, release in November

మెట్రో` 50 శాతం పూర్తి, న‌వంబ‌ర్‌లో రిలీజ్‌

Metro completes 50 percent Shoot, release in November

ప్రేమిస్తే, జ‌ర్నీ, షాపింగ్‌మాల్‌, పిజ్జా వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల్ని అందించిన‌ ఎస్‌.కె.పిక్చ‌ర్స్ అధినేత‌ సురేష్ కొండేటి స‌మ‌ర్ప‌కుడిగా, ఆర్‌4 ఎంట‌ర్‌టైన్‌మెంట్ అధినేత ర‌జ‌ని తాళ్లూరి అందిస్తున్న‌ చిత్రం - మెట్రో. ఆనంద్ కృష్ణ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జోహ‌న్ సంగీతం అందించారు. సాహితి పాట‌లు, మాట‌లు అందిస్తున్నారు. ఈ సినిమా పాట‌ల రికార్డింగ్ ఇటీవ‌లే పూర్త‌యింది. అలాగే డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు 50 శాతం పూర్త‌య్యాయి. న‌వంబ‌ర్‌లో సినిమాని రిలీజ్ చేసేందుకు నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత, ఆర్‌4 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌జ‌ని తాళ్లూరి మాట్లాడుతూ -చైన్ స్నాచింగ్ నేప‌థ్యంలో ఇంట్రెస్టింగ్ క‌థాంశంతో తెర‌కెక్కించిన సినిమా ఇది. యాక్ష‌న్‌ డ్రామా, థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే క‌థాంశంతో తెర‌కెక్కింది. నిత్యం మ‌నం వార్త‌ల్లో వినే చైన్ స్నాచింగ్ నేప‌థ్యంలో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ద‌ర్శ‌కుడు ఓ విజువ‌ల్ ట్రీట్‌గా తెర‌కెక్కించారు. చ‌క్క‌ని సంగీతం ఉన్న‌ ఎంట‌ర్‌టైన‌ర్‌. పాట‌ల రికార్డింగ్ పూర్త‌యింది. అలాగే అనువాద కార్య‌క్ర‌మాలు స‌గం పూర్తి చేశాం. న‌వంబ‌ర్‌లో సినిమా రిలీజ్ చేయ‌నున్నాం అన్నారు.

 

ఎస్‌.కె.పిక్చ‌ర్స్ అధినేత, చిత్ర స‌మ‌ర్ప‌కులు సురేష్ కొండేటి మాట్లాడుతూ -రియాలిటీ ఉన్న క‌థ‌లతో తెర‌కెక్కిన సినిమాల‌కు తెలుగు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఆ కోవ‌లోనే ప్రేమిస్తే, జ‌ర్నీ, షాపింగ్‌మాల్‌, పిజ్జా వంటి చిత్రాల్ని మా బ్యాన‌ర్‌లో అందించాం. అవ‌న్నీ స‌హ‌జ‌సిద్ధ‌మైన న‌ట‌న‌, చ‌క్క‌ని క‌థాంశంతో తెర‌కెక్కిన‌వే కావ‌డం వ‌ల్ల బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ సాధించాయి. ఆ కోవ‌లోనే `మెట్రో` హృద‌యాల్ని ట‌చ్ చేసే రియ‌లిస్టిక్ స్టోరీతో తెర‌కెక్కింది. మ‌నం నిత్యం వార్తా చానెళ్ల‌లో చైన్ స్నాచ‌ర్ల గురించి వింటూనే ఉన్నాం. సామాన్యుడి బ‌తుకులో ఈ చైన్ స్నాచింగ్ ఎలాంటి చిచ్చు పెడుతుందో మెట్రో సినిమాలో చూడొచ్చు. తన కన్నతల్లి చావుకు కారణమైన చైన్ స్నాచర్‌ని పట్టుకోవడానికి ప్రయత్నించిన జర్నలిస్ట్... ఆ క్రమంలో తను  తెలుసుకున్న నిజాలేంటి..? అస‌లు చైన్ స్నాచర్ల‌ లక్ష్యమేంటి..? అన్న‌ది తెర‌పైనే చూడాలి.  బ్యాలెన్స్ ప‌నులు పూర్తి చేసి న‌వంబ‌ర్ లో  సినిమా రిలీజ్ చేస్తాం అని తెలిపారు.

శిరీష్‌, బాబి సింహా, సేంద్ర‌న్‌, నిశాంత్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతం:  జోహ‌న్‌, మాట‌లు- పాట‌లు:  సాహితి, కెమెరా: ఎన్‌.ఎస్‌. ఉద‌య కుమార్‌, నిర్మాత‌:  ర‌జ‌ని తాళ్లూరి, స‌మ‌ర్ప‌కులు:  సురేష్ కొండేటి, ద‌ర్శ‌క‌త్వం: ఆనంద కృష్ణ‌న్‌.

Facebook Comments

%d bloggers like this: