Social News XYZ     

Nithya Menon’s Ghatana censored, releasing in October

'ఘటన' సెన్సార్‌ పూర్తి - అక్టోబర్‌లో విడుదల

Nithya Menon's Ghatana censored, releasing in October

'ద శ్యం' వంటి సూపర్‌హిట్‌ చిత్రం తర్వాత శ్రీప్రియ దర్శకత్వంలో వస్తోన్న మరో అద్భుత దృశ్యకావ్యం 'ఘటన'. నిత్యామీనన్‌ ప్రధాన పాత్రలో క్రిష్‌ జె. సత్తార్‌ హీరోగా మలయాళంలో సూపర్‌హిట్‌ అయిన '22 ఫిమే ల్‌ కొట్టాయం' చిత్రాన్ని సన్‌మూన్‌ క్రియేషన్స్‌ పతాకంపై శ్రీప్రియ దర్శకత్వంలో వి.ఆర్‌. కృష్ణ ఎం. 'ఘటన' పేరుతో తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

దర్శకురాలు శ్రీప్రియ మాట్లాడుతూ - ''ద శ్యం' చిత్రాన్ని తెలుగులో వెంకటేష్‌, తమిళంలో కమల్‌హాసన్‌గారు చేశారు. తెలుగులో, తమిళ్‌లో ఈ చిత్రం పెద్ద హిట్‌ అయింది. ద శ్యం తర్వాత నేను తెలుగులో చేస్తున్న సినిమా 'ఘటన'. ఆడదంటే ఆటబొమ్మ కాదు.., ఏదైనా చేయగల ఆది పరాశక్తి అని తెలియజేసే చిత్ర మిది. సినిమా కమర్షియ ల్‌గా ఉంటుంది. సినిమాలో మెయిన్‌రోల్‌లో నిత్యా మీనన్‌ అద్భుతంగా నటించింది. సమాజం లో జరిగే విషయాలను ఈ సినిమాలో ఒక పర్సనల్‌ వ్యక్తికి జరిగినప్పుడు, ఆ వ్యక్తి ఎలా స్పందిస్తాడనేదే ఈ సినిమా'' అన్నారు.

 

రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ - ''సినిమా డిఫరెంట్‌ సబ్జెక్ట్‌తో తెరకెక్కింది. ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని సబ్జెక్ట్‌. నర్సు ఉద్యోగాల కోసం వేరే దేశాలకు వెళ్ళే అమ్మాయిలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారు అనే విషయాన్ని ఒక వ్యక్తి ఆధారంగా చేసుకుని శ్రీప్రియగారు తెరకెక్కించారు. ఇలాంటి మహిళా సబ్జెక్ట్‌ను డీల్‌ చేయడానికి మహిళా దర్శకురాలే కరెక్ట్‌. శ్రీప్రియగారు సినిమాను చాలా బాగా తీశారు'' అన్నారు.

నిర్మాత వి.ఆర్‌. కృష్ణ ఎం. మాట్లాడుతూ - ''ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మలయాళంలో సంచలనం సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారన్న కాన్ఫిడెన్స్‌తో వున్నాం'' అన్నారు.
నిత్యామీనన్‌, క్రిష్‌ జె. సత్తార్‌, నరేష్‌, కోట శ్రీనివాసరావు, కోవై సరళ, విద్యుల్లేఖ రామన్‌, అంజలీరావు, జానకి, గౌతమి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: మనోజ్‌ పిళ్ళై, ఎడిటింగ్‌: బవన్‌ శ్రీకుమార్‌, సంగీతం: అరవింద్‌ శంకర్‌, ఆర్ట్‌: ప్రేమ్‌నవాస్‌, పాటలు: అనంత శ్రీరామ్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అను పార్థసారథి, సమర్పణ: బేబి సంస్కృతి ఎం, బేబీ అక్షర ఎం, నిర్మాత: వి.ఆర్‌. కృష్ణ ఎం, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీప్రియ

Facebook Comments

%d bloggers like this: