Social News XYZ     

Dhanush’s Rail releasing on September 22nd

సెప్టెంబర్‌ 22న ధనుష్‌ 'రైల్‌' విడుదల

Dhanush's Rail releasing on September 22nd

రఘువరన్‌ బి.టెక్‌, అనేకుడు, మాస్‌, మరియన్‌ వంటి విభిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో ధనుష్‌ కథానాయకుడిగా, నేను శైలజ వంటి సూపర్‌హిట్‌ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన కీర్తి సురేష్‌ కథానాయికగా రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'రైల్‌'. ఆదిత్య మూవీ కార్పొరేషన్‌, శ్రీ పరమేశ్వరి రగ్న పిక్చర్స్‌ పతాకాలపై బేబి రోహిత రజ్న సమర్పణలో ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి మాట్లాడుతూ - ''ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకి అన్ని చోట్ల నుంచి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. రఘువరన్‌ బి.టెక్‌ తర్వాత తెలుగు ప్రేక్షకుల్లో హీరో ధనుష్‌కి మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'రైల్‌' ధనుష్‌కి తెలుగులో మరో సూపర్‌ హిట్‌ మూవీ అవుతుంది. సెప్టెంబర్‌ 22న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

 

ధనుష్‌, కీర్తి సురేష్‌, తంబి రామయ్య, కరుణాకరన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమ్మాన్‌, సినిమాటోగ్రఫీ: వెట్రివేల్‌ మహేంద్రన్‌, ఎడిటింగ్‌: ఎల్‌.వి.కె.దాస్‌, ఫైట్స్‌: స్టన్‌ శివ, మాటలు: వెన్నెలకంటి, పాటలు: వెన్నెలకంటి, సాహితి, నిర్మాణ సారధ్యం: వడ్డి రామానుజం, సమర్పణ బేబి రోహిత రజ్న, నిర్మాతలు: ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి, దర్శకత్వం: ప్రభు సాల్మన్‌.

Facebook Comments

%d bloggers like this: