Social News XYZ     

Dubbing work in progress for ‘Dirty Game’

డబ్బింగ్ కార్యక్రమాల్లో 'డర్టీగేమ్‌'

Dubbing work in progress for 'Dirty Game'

ఖయ్యుమ్‌, నందినీ కపూర్‌ జంటగా షిరిడి సాయి క్రియేషన్స్‌ పతాకంపై అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్‌ కుమార్‌ నిర్మిస్తున్న పొలిటికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం 'డర్టీగేమ్‌'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత తాడి మనోహర్‌ కుమార్‌ మాట్లాడుతూ..దర్శకుడు పక్కా ప్లానింగ్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సింగిల్‌ షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ఎడిటింగ్ పూర్తి చేసుకుంది. డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కోట శంకర్ రావు గారు డబ్బింగ్ చెబుతున్నారు. ఆయన ఇందులో చాలా ప్రముఖ పాత్ర పోషించారు. వర్తమాన రాజకీయ నేపథ్యంతో పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తూ పొలిటికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఉంటుంది. త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి.. అక్టోబర్‌లో చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నాము. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే పూర్తి నమ్మకంతో ఉన్నాము..అని అన్నారు.

 

ఖయ్యుమ్‌, నందినీ కపూర్‌, పరుచూరి గోపాలకృష్ణ, కోట శ్రీనివాస రావు, సురేష్‌, కోట శంకర్ రావు, అస్మిత, రమ్య, తాడి మనోహర్‌ నాయుడు, జబర్ధస్త్‌ టీమ్‌ మొదలగువారు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్‌, నిర్మాత: తాడి మనోహర్‌ కుమార్‌, కథ-మాటలు-పాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ.

Facebook Comments