Social News XYZ     

Nani’s Majnu releasing on September 23rd

సెప్టెంబర్‌ 23న నేచురల్‌ స్టార్‌ నాని 'మజ్ను'

Nani's Majnu releasing on September 23rd

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ పతాకాలపై పి.కిరణ్‌, గోళ్ళ గీత అందిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'మజ్ను'. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 23న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

 

ఈ సందర్భంగా దర్శకుడు విరించివర్మ మాట్లాడుతూ - ''ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు చాలా మంచి స్పందన లభిస్తోంది. గోపిసుందర్‌ సారధ్యంలో రూపొందిన అన్ని పాటలూ సూపర్‌హిట్‌ అయ్యాయి. అలాగే ట్రైలర్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. నాని కెరీర్‌లో 'మజ్ను' మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 23న విడుదల చెయ్యడానికి ప్లానింగ్‌ జరుగుతోంది'' అన్నారు.

నేచురల్‌ స్టార్‌ నాని, ఇమ్మానుయేల్‌, ప్రియాశ్రీ, వెన్నెల కిషోర్‌, సత్యకృష్ణ, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, సత్య, శివన్నారాయణ, రాజ్‌ మాదిరాజ్‌, కేవశదీప్‌, అనుపమ, మనీషా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌., సంగీతం: గోపీసుందర్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, దర్శకత్వం: విరించి వర్మ.

Facebook Comments

%d bloggers like this: