Social News XYZ     

Vikram’s Inkokkadu Audio Launch on August 15th

స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న విక్ర‌మ్ ఇంకొక్క‌డు ఆడియో

Vikram's Inkokkadu Audio Launch on August 15th
శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న మరో ఎక్స్ పెరిమెంటల్ యాక్షన్ థ్రిల్లర్ 'ఇంకొక్కడు'. నయనతార, నిత్యామీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం 'ఇరుముగన్'. ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్.కె.ఆర్.ఫిలింస్ బ్యానర్ పై ఆ సంస్థ అధినేత నీలం కృష్ణారెడ్డి 'ఇంకొక్కడు' అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని ఆగ‌స్ట్ 15న హైద‌రాబాద్‌లో నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా....

నీలం కృష్ణారెడ్డి మాట్లాడుతూ ''చియాన్ విక్ర‌మ్ హీరోగా, గ్లామ‌ర్ క్వీన్స్ న‌య‌న‌తార‌, నిత్యామీన‌న్‌లు న‌టించిన చిత్రం ఇంకొక్క‌డు. శిబుథమీన్స్ గారు, ఆనంద్ శంకర్ గారు కాంబినేషన్ లో భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్, విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రం రూపొందుతోంది. స్టార్ న‌టీన‌టుల‌తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ గా హరీష్ జైరాజ్, సినిమాటోగ్రాఫర్ గా ఆర్.రాజశేఖర్, ఎడిటర్ గా భువన్ శ్రీనివాస్ వంటి టాప్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఇటీవ‌ల త‌మిళంలో విడుద‌లైన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌, పాట‌ల‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ప్ర‌తి సినిమాలో ఏదో ఒక విల‌క్ష‌ణ‌త‌ను చూపే చియాన్ విక్ర‌మ్ గారు ఈ చిత్రంలో హీరోగానే కాకుండా, హిజ్రా గెట‌ప్‌లో కూడా అల‌రిస్తున్నారు. సినిమా ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత సినిమా మేకింగ్ వాల్యూస్‌కు, విక్ర‌మ్ స్ట‌యిల్‌, గెట‌ప్స్ కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.  ట్రైల‌ర్‌కు దాదాపు 5 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి. సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. అందుకే ఈ భారీ బ‌డ్జెట్ చిత్ర ఆడియో వేడుక‌ను స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న టాలీవుడ్‌కు చెందిన సెల‌బ్రిటీల స‌మ‌క్షంలో జె.ఆర్‌.సి. క‌న్వెక్ష‌న్ సెంట‌ర్‌లో గ్రాండ్‌గా  నిర్వ‌హిస్తున్నాం'' అన్నారు.

Facebook Comments
Vikram's Inkokkadu Audio Launch on August 15th

About Raju Sagi

 

%d bloggers like this: