Social News XYZ     

Dhanraj & Co Starring “Bantipoola Janaki” Audio on July 29th

ఈ నెల 29న శిల్పకళా వేదికపై "బంతిపూల జానకి" ఆడియో!!

Dhanraj & Co Starring "Bantipoola Janaki" Audio on July 29th

Bantipoola Janaki Stills

సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలు, లేదా భారీ బ్యాక్ గ్రౌండ్ గలవారు నిర్మించే సినిమాల ఆడియో వేడుకలు మాత్రమే హైద్రాబాద్, హైటెక్ సిటీకి సమీపంలో గల "శిల్ప కళా వేదిక"పై జరుగుతాయి. కానీ తొలిసారిగా "బంతిపూల జానకి" అనే ఓ చిన్న సినిమా ఆడియో వేడుకకు "శిల్ప కళా వేదిక" వేదిక కానుంది. ఈ నెల 29, శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి "బంతిపూల జానకి" ఆడియో వేడుక "మాంచి జబర్దస్త్"గా జరగనుంది.

 

ఈ చిత్రం గీతాలు "మ్యాంగో మ్యూజిక్" ద్వారా మార్కెట్ లో లభ్యం కానున్నాయి. ధన్ రాజ్, దీక్షాపంత్, షకలక శంకర్, అదుర్స్ రఘు, వేణు, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, సుడిగాలి సుధీర్ ముఖ్య తారాగణంగా.. హాస్యానికి పెద్ద పీట వేస్తూ.. "ఆద్యంతం అత్యంత ఉత్కంఠభరితం" అనిపించేలా తెరకెక్కుతున్న ఈ కామెడీ థ్రిల్లర్ ను ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై కళ్యాణి-రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్సకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొద్యూసర్ తేజ.

ఈ సందర్భంగా దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ.. "ఆర్టిస్టులు మరియు సాంకేతిక నిపుణులందరి సహాయ సహకారాలతో కామెడి థ్రిల్లర్ గా రూపొందుతున్న "బంతిపూల జానకి" చిత్రం అవుట్ పుట్ చాలా సంతృప్తిగా వచ్చింది. 2016లో ఘన విజయం సాధించబోయే చిన్న చిత్రాల జాబితాలో "బంతిపూల జానకి" తప్పక స్థానం సంపాదించుకుంటుంది" అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తేజ మాట్లాడుతూ.. "బోలె సంగీతం "బంతిపూల జానకి" చిత్రానికి మెయిన్ ఎస్సెట్ గా నిలుస్తుంది. ఈ నెల 29న ఆడియో విడుదల చేసి.. ఆగస్టు 19న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు!!
డాక్టర్ భరత్ రెడ్డి, ఫణి, కోమలి, జీవన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: డా. శివ వై.ప్రసాద్, కెమెరా: జి.ఎల్.బాబు, కథ-మాటలు: శేఖర్ విఖ్యాత్, సంగీతం: బోలె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తేజ, నిర్మాతలు: కళ్యాణి-రామ్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్!!

Facebook Comments

%d bloggers like this: