Social News XYZ     

Aditya Om’s Friend Request releasing on July 8th

జూలై 8న ఆదిత్య ఓం 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌'

Aditya Om's Friend Request releasing on July 8th

మోడరన్‌ సినిమా పతాకంపై హీరో ఆదిత్య ఓం స్వీయ దర్శకత్వంలో సోషల్‌ మీడియా బ్యాక్‌డ్రాప్‌లో నిర్మించిన యూత్‌ఫుల్‌ హారర్‌ ఎంటర్‌టైనర్‌ 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌'. రోహిత్‌, ప్రకాష్‌, శీతల్‌, రిచాసోని, సాగరిక ఛైత్రి, మనీషా కేల్కర్‌, నితేష్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో ఆదిత్య ఓం ఓ ప్రత్యేక పాత్రలో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూలై 8న గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు.

దర్శకుడు ఆదిత్య ఓం మాట్లాడుతూ - ''సోషల్‌ మీడియాకు యువత ఎలా బానిసలవుతున్నారు, తద్వారా వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అనే అంశాన్ని తీసుకొని మెసేజ్‌ ఓరియంటెడ్‌గా ఈ చిత్రాన్ని చేశాం. హార్రర్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం నాకు వుంది. జూలై 8న ఈ చిత్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం'' అన్నారు.

 

సహ నిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి మాట్లాడుతూ - ''ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, ట్రైలర్‌ రిలీజ్‌ అయినప్పటి నుంచి మంచి క్రేజ్‌ వచ్చింది. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ చిత్రానికి మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. ఈ సినిమా రిలీజ్‌ కోసం సోషల్‌ మీడియా ఫ్రెండ్స్‌ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల మా యూనిట్‌ సభ్యులను సోషల్‌ మీడియా ఫ్రెండ్స్‌ ప్రత్యేకంగా కలుసుకొని అందరికీ అభినందనలు తెలియజేయడం చాలా సంతోషాన్ని కలిగించింది. ప్రస్తుతం మా చిత్రం ప్రమోషన్‌లో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని అన్ని సెంటర్స్‌ను సందర్శిస్తున్నాం. మా చిత్రం ఎలాంటి కాన్సెప్ట్‌తో రూపొందిందీ, ఎవరిని టార్గెట్‌ చేస్తూ ఈ చిత్రాన్ని చేశాం అనే విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నాం. మా చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. జూలై 8న రెండు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను'' అన్నారు.

రోహిత్‌, ప్రకాష్‌, శీతల్‌, రిచాసోని, సాగరిక ఛైత్రి, మనీషా కేల్‌కర్‌, నితేష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: రాఘవ, సంగీతం: లవన్‌, వీరన్‌, కెమెరా: సిద్ధార్థ్‌, సహనిర్మాత, నిర్మాణ, నిర్వహణ: విజయవర్మ పాకలపాటి, నిర్మాణం: మోడ్రన్‌ సినిమా, కథ, దర్శకత్వం: ఆదిత్య ఓం.

Facebook Comments

%d bloggers like this: