Social News XYZ     

Aadi’s Chuttalabbayi Audio on July 16th

జూలై 16న ఆది, వీరభద్రమ్‌ల 'చుట్టాలబ్బాయి' ఆడియో

Aadi's Chuttalabbayi Audio on July 16th

లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ మరియు శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్‌ బ్యానర్స్‌పై వీరభద్రమ్‌ దర్శకత్వంలో రామ్‌ తాళ్ళూరి, వెంకట్‌ తలారి సంయుక్తంగా నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'చుట్టాలబ్బాయి'. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ ఇటీవల విడుదలై యూ ట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. కేవలం 24 గంటల్లోనే 1.5 లక్షల వ్యూస్‌ సాధించింది.
'చుట్టాలబ్బాయి' టీజర్‌కు 24 గంటల్లో 1.5 లక్షల వ్యూస్‌

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - ''మా 'చుట్టాలబ్బాయి' టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఒక్కరోజులోనే 1.5 లక్షల వ్యూస్‌ రావడం, టీజర్‌ రిలీజ్‌ తర్వాత సినిమాకి మరింత పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. టీజర్‌ చూసిన వారంతా ఖర్చుకు వెనకాడకుండా చాలా లావిష్‌గా చిత్రాన్ని తెరకెక్కించారని ప్రశంసిస్తున్నారు. ఇప్పటివరకు ఆది కెరీర్‌లో వచ్చిన సినిమాల్లో హయ్యస్‌ బడ్జెట్‌తో నిర్మిస్తున్న సినిమా 'చుట్టాలబ్బాయి'. కొత్త లుక్‌తో, డిఫరెంట్‌ బాడీ లాంగ్వేజ్‌తో టీజర్‌తోనే అందర్నీ ఆకట్టుకుంటున్నాడు ఆది. వీరభద్రం వాయిస్‌తో 'ఏవండీ.. ఎవరా అబ్బాయి' అనగానే పోసాని 'చుట్టాలబ్బాయి' అని చెప్పడం అందర్నీ ఆకర్షిస్తోంది. అలాగే పృథ్వీ డైలాగ్స్‌ కూడా ఎంటర్‌టైనింగ్‌గా వున్నాయంటున్నారు. ఈ టీజర్‌లో డ్రాగన్‌ ప్రకాష్‌ కంపోజ్‌ చేసిన ఫైట్‌ టీజర్‌కే హైలైట్‌ అయింది. 'పూలరంగడు' తర్వాత మరో సూపర్‌హిట్‌ కొట్టడానికి వీరభద్రమ్‌ రెడీ అవుతున్నారని టీజర్‌ చూసిన ప్రతి ఒక్కరూ చెప్పడం చాలా హ్యాపీగా వుంది. అలాగే మొట్ట మొదటిసారి ఆది, సాయికుమార్‌గారు కలిసి నటించిన సినిమా కావడంతో 'చుట్టాలబ్బాయి'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. థమన్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ చేశారు. జూలై 16న ఈ చిత్రం ఆడియోను చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే 'చుట్టాలబ్బాయి'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు.

 

లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది, నమిత ప్రమోద్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్వి, రఘుబాబు, కృష్ణభగవాన్‌, అభిమన్యు సింగ్‌, జీవా, సురేఖావాణి, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, రచ్చ రవి, గిరిధర్‌, అనితనాథ్‌ దితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌, సినిమాటోగ్రఫీ: ఎస్‌.అరుణ్‌కుమార్‌, ఆర్ట్‌: నాగేంద్ర, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, మాటలు: భవాని ప్రసాద్‌, స్టిల్స్‌: గుణకర్‌, నిర్మాతలు: రామ్‌ తాళ్ళూరి, వెంకట్‌ తలారి, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: వీరభద్రమ్‌.

Facebook Comments

%d bloggers like this: