Social News XYZ     

Super Star Suriya Starrer “Memu” Releasing on 1st July

జూలై 1న వస్తున్న సూపర్ స్టార్ సూర్య "మేము"

Super Star Suriya Starrer "Memu" Releasing on 1st July

సూపర్ స్టార్ సూర్య-అమలాపాల్-బిందుమాధవి నటించగా తమిళంలో ఘన విజయం సాధించిన "పసంగ-2" తెలుగులో "మేము" పేరుతో అనువాధమవుతుండడం తెలిసిందే.  ప్రముఖ దర్శకుడు పాండిరాజ్ రూపొందించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ ను  "స్టూడియో గ్రీన్ జ్ఞాన్ వేల్ రాజాతో కలిసి.. తన సొంత నిర్మాణ సంస్థ "2 డి ఎంటర్ టైన్మెంట్స్" పతాకంపై.. సూర్య స్వయంగా సమర్పిస్తుండడం విశేషం.  సాయి మణికంఠ క్రియేషన్స్ పతాకంపై జూలకంటి మధుసూదన్ రెడ్డి నిర్మిస్తున్న "మేము" చిత్రం జూలై 1న  ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా జూలకంటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ... "సూపర్ స్టార్ సూర్య-స్టూడియో గ్రీన్ జ్ఞాన్ వేల్ రాజాల సంయుక్త  సమర్పణలో "మేము" చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. "ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలతో కలిసి కచ్చితంగా చూసి తీరాల్సిన సినిమా ఇది" అని తమిళ మీడియాతో పాటు ఇంగ్లీష్ మీడియా సైతం ముక్త కంఠంతో   తీర్మానించిన గొప్ప సినిమా ఇది. వరుస విజయాలతో తమిళంలో సంచలన దర్శకుడిగా పేరొందిన పాండిరాజ్ "మేము" చిత్రంతో తన ప్రతిభాపాటవాలు మరోసారి  నిరూపించుకున్నాడు. జూలై 1న  ఈ చిత్రాన్ని అత్యధిక దియేటర్స్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. తెలుగులోనూ ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం మాకుంది" అన్నారు.

 

ఈ చిత్రానికి సంగీతం: అర్రోల్ కొరెల్లి, చాయాగ్రహణం: బాలసుబ్రమణియన్, మాటలు-పాటలు: శశాంక్ వెన్నెలకంటి, సమర్పణ: "సూపర్ స్టార్" సూర్య-కె.ఇ. జ్ఞాన వేల్ రాజా, నిర్మాత: జూలకంటి మధుసూదన్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్సకత్వం: పాండిరాజ్!!

Facebook Comments

%d bloggers like this: