Social News XYZ     

Fortunate to do a movie like Brahmotsavam after Srimanthudu : Mahesh

Fortunate to do a movie like Brahmotsavam after Srimanthudu : Mahesh

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా పి.వి.పి. సినిమా, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకాలపై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మిస్తోన్న యూత్‌ఫుల్‌ లవ్‌ స్టోరీ ‘బ్రహ్మోత్సవం’. ఈ సినిమా మే 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల సినిమా గురించి విశేషాలను తెలియజేశారు.

ముందుగా మహేష్ బాబు మాట్లాడుతూ..

 

ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నారు…
సినిమాలో చూడాల్సిందేనండీ. అయితే ట్రైలర్ లో మేమైదేతే చెప్పాలనుకున్నామో ఆ విషయం చాలా క్లియర్ గానే చెప్పాం. సినిమా ను మే 20న విడుదల కానుంది. అనుకున్న తేదీలో సినిమా విడుదల కావడానికి యూనిట్ అంతా కష్టపడ్డారు. ఎట్టకేలకు అనుకున్న రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం.

శ్రీకాంత్ అడ్డాలగారితో వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్….
సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో శ్రీకాంత్ అడ్డాలగారు నన్ను ప్రెజంట్ చేసిన తీరు, బ్రహ్మోత్సవంలో చూపించిన తీరు పూర్తి భిన్నంగా ఉంటుంది. నేను కూడా చాలా ఎగ్జయిట్ మెంట్ తో వెయిట్ చేస్తున్నాం. చాలా ఫ్రెష్ స్టోరీ. ఇలాంటి పాయింట్ తో సినిమా నేను చేయలేదు.

నా అదష్టంగా భావిస్తున్నా….
శ్రీమంతుడు సినిమా చేస్తున్నప్పుడే శ్రీకాంత్ గారు ఈ కథను నాకు చెప్పారు, నాకు నచ్చడంతో చేయడానికి రెడీ అయ్యాను. అంతే తప్ప శ్రీమంతుడు విడుదలై, మంచి ఫలితం వచ్చిన తర్వాత ఈ సినిమా చేయాలనుకోలేదు. శ్రీమంతుడు తర్వాత బ్రహ్మోత్సవం చిత్రం చేయడం నా అదృష్టం.

ప్రసాద్ గారికి థాంక్స్….
నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి గారికి థాంక్స్. ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆయన మాకు ఏదీ కావాలంటే అది అందించడం వల్లే సినిమా అవుట్ పుట్ ఇంత బాగా రావడానికి ఆయనే కారణం. మా కంటెంట్ ను నమ్మి మాతో ట్రావెల్ చేసినందుకు ఆయనకు థాంక్స్.
ఒకే షెడ్యూల్ లో ఉదయపూర్, పూణే, హరిద్వార్ ఇలా అన్నీ అవుట్ డోర్స్ కు వెళ్లాం.

నటించకూడదు…
హీరోగా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు చాలా క్యారెక్టర్స్ చేశాను. అయితే బ్రహ్మోత్సవం వంటి సినిమా చేసేటప్పుడు ప్యూర్ గా ఉండాలి. కథను బట్టి నటించకూడదు. ఈ కథ వేరుగా ఉంటుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ప్రతి సీన్ లో చాలా మంది నటీనటులుండేవారు. రెండు, మూడు రోజుల్లో అంతా సెట్ అయ్యింది. శ్రీకాంత్ అడ్డాల గారు ఎక్కడా మారలేదు.

వాటిని గుర్తుకు తెస్తుంది…
జీవితంలో ఇప్పుడు పోటీ ప్రపంచంలో చిన్న చిన్న ఫీలింగ్స్ ను, ఎమోషన్స్ క్యారీ చేయడం మరచిపోతున్నాం. మా బ్రహ్మోత్సవం సినిమా వాటిని గుర్తుకు తెస్తుంది.

నెక్ట్స్ ప్రాజెక్ట్…
నెక్ట్స్ ప్రాజెక్ట్ మురుగదాస్ గారి దర్శకత్వంలో ఉంటుంది. ఆ సినిమా కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాను తెలుగు, తమిళంలో నిర్మిస్తున్నాం.

శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ…
ఫస్ట్ లుక్ పోస్టర్ లో సూపర్ స్టార్ మహేష్ తండ్రి కాళ్లకే చెప్పులు తొడుగుతుంటాడు. ఈ పోస్టర్ ను విడుదల చేసేటప్పుడు మేం ఫ్యాన్స్ పాజిటివ్ గానే ఆలోచిస్తారని అనుకున్నాం. అనుకున్నట్టుగానే ఫ్యాన్స్ పాజిటి గానే తీసుకున్నారు. టైటిల్ లో శ్రీవారి పాదాలను చూపించడానికి కారణం, హీరో అంత వినయంగా ఉంటారని చూపించడమే. వినయంగా ఉంటే మంచిదే కదా మరి..సాధారణంగా ఊళ్లో జరిగే బ్రహ్మోత్సవాలు జరగుతుంటాయి కదా, దాన్ని బట్టే టైటిల్ ను పెట్టాం. మంచి లవ్ స్టోరీ. ఫ్యామిలీతో విలువలతో కలిసి ఉంటుంది.

Facebook Comments

%d bloggers like this: