South Cinema

RRR movie to be titled Rajasam?

ఆర్.ఆర్.ఆర్ కు కొత్త టైటిల్ !.

RRR movie to be titled Rajasam?

రాజమౌళి దర్శకత్వంలో చరణ్, ఎన్‌టి‌ఆర్ నటిస్తున్న సినిమాకు రామ. రావణ రాజ్యం టైటిల్ ఖరారు అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ టైటిల్ లో వాస్తవం లేదని చిత్ర వర్గాల నుండి తెలిసింది. మరి ఈ సినిమాకు టైటిల్ ఎంటనేసందేహం మళ్ళీ అందరికి మొదలయ్యింది.

 

తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు రాజసం అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సింపుల్ గా ఉండే ఈ టైటిల్ ఫిక్స్ చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఈ నెల 19 నుండి ప్రారంభం కానుంది.

సెందిల్ కామెరామెన్ గా పని చేస్తున్న ఈ సినిమాకు బుర్ర సాయి మాధవ్ మాటలు రాస్తున్నారు. గత జన్మల నేపద్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ ఎవరనేది త్వరలో క్లారిటీ రానుంది. మూడో షెడ్యూల్ నుండి హీరోయిన్స్ జాయిన్ కాబోతున్నారు.

Facebook Comments
Share