Kerub Movie Review: A Gripping Fantasy Thriller With a Slow Start and a Racy Second Half (Rating: 3.0)

విహాన్ కార్తీక్, దివ్య విశ్వకర్మ హీరో హీరోయిన్స్ గా నటించిన సినిమా "కెరూబ్". ఈ చిత్రాన్ని ఖుషి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ బాలు బల్లెకారి నిర్మించారు, ఫాంటసీ థ్రిల్లర్ కథతో దర్శకుడు ఎం జె నాయుడు (జీవన్) రూపొందించారు. ఈ సినిమా నవంబర్ 20న థియేటర్స్ లో విడుదల అయ్యింది, సినిమా ఎలా ఉందొ రివ్యూ లో చూద్దాం.

కథ :
ఒక దారుణమైన దాడి నుండి ప్రాణాలతో బయటపడిన తర్వాత, ఒక యువతి తన గతం గురించిన ఏ జ్ఞాపకం లేకుండా ఒక మర్మమైన అడవిలో మేల్కొంటుంది. ఒక సన్యాసిని వేషంలో, ఆమె అడవిలో నివసించే ఒక రహస్యమయ వ్యక్తితో కలిసి ఒక ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. చివరకు అతను, జీవితం మరియు ప్రకృతిపై మానవాళి అవగాహనను మార్చివేయగల రహస్యాలను కాపాడుతున్న ఒక దివ్య పురుషుడని ఆమె కనుగొంటుంది, ఇది ఈ చిత్ర కథాంశం

విశ్లేషణ
విహాన్ కార్తీక్, దివ్య విశ్వకర్మ హీరో హీరోయిన్లుగా చాలా చక్కగా నటించారు, అనుభవం కలిగిన ఆర్టిస్టులు లాగ నటించి మెప్పించారు అలాగే కల్పలత, సుమన్ శెట్టి, రమేష్ కొనంభొట్ల, గడ్డం సురేష్, శ్రీధర్ మాడ, తదితరులు వారి పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

 

దర్శకులు ఎం జె నాయుడు ( జీవన్ ) రాసుకున్న కథ చాలా గొప్పగా ఉంది, దాన్ని తెరమీద చూపించిన విధానం అందరిని అలరిస్తుంది. ఒక మంచి సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆర్ట్ డైరెక్టర్ కొక్కుల ప్రసాద్ వర్క్ బాగుంది, సహజమైన లొకేషన్స్ లో సినిమాటోగ్రాఫర్ రమేష్ తోకల అద్భుతంగా తెరాకెక్కించారు, తన కెమెరా వర్క్ సినిమాకు అదనపు ఆకర్షణ, మ్యూజిక్ డైరెక్టర్ సత్య రాధాకృష్ణ చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు, నేపథ్య సంగీతం ఇంకా బాగుంది. సినిమా మొదటిభాగం లో అక్కడక్కడ కొంచెం నెమ్మదిగా ఉంది, సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ గా రేసీగా ఉంది. ఓవరాల్ గా ఇది మంచి సినిమా.

ప్రొడ్యూసర్ బాలు బల్లెకారి నిర్మాతగా సక్సెస్ అయ్యారు, గ్రాండ్ స్కేల్ లో కెరూబ్ సినిమాను నిర్మించారు, ఒక మంచి డిఫరెంట్ సినిమా చూడాలనుకున్న ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండ నచ్చుతుంది

రేటింగ్ : 3/5

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share