మంగళగిరి సిగలో మరో విల్లా మణిహారం.. ‘ది రిజర్వ్’కు భూమిపూజ

అత్యున్నత జీవనశైలికి ప్రతీకగా ‘ది రిజర్వ్’.. మంగళగిరిలో 59 విల్లాల నిర్మాణం
మంగళగిరిలో అత్యాధునిక విల్లా ప్రాజెక్టుకు శ్రీకారం
ది రిజర్వ్’కు మిరానా రియాల్టీ భూమిపూజ.. 9.5 ఎకరాల్లో 59 విలాసవంతమైన విల్లాల నిర్మాణం
అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రీమియం నివాస సముదాయాల అభివృద్ధిలో భాగంగా మంగళగిరిలో మరో ప్రతిష్ఠాత్మక విల్లా ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ మిరానా రియాల్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారి కి ఆనుకుని, మంగళగిరి నగర పరిధిలో గల కొండపనేని టౌన్‌షిప్‌కు ఎదురుగా నిర్మించనున్న ‘ది రిజర్వ్’ లగ్జరీ విల్లా ప్రాజెక్టుకు గురువారం సంప్రదాయబద్ధంగా భూమిపూజ నిర్వహించారు...
మొత్తం 9.5 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో 59 అత్యాధునిక విల్లాలను నిర్మించనున్నారు. పరిమిత సంఖ్యలో విల్లాలతో ప్రత్యేక నివాస సముదాయంగా తీర్చిదిద్దనున్న ఈ ప్రాజెక్టులో విశాలమైన నివాస ప్రదేశాలు, ఆధునిక నిర్మాణశైలి, వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యత కల్పించనున్నారు. భూమిపూజ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, యాజమాన్య బృందం, గృహ కొనుగోలుదారులు, భాగస్వాములు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు...
విజయవాడ–గుంటూరు నగరాల మధ్య కీలక ప్రాంతమైన మంగళగిరిలో, జాతీయ రహదారి 16కు అనుసంధానంగా ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం ప్రత్యేకతగా నిలవనుంది. విజయవాడ, గుంటూరు నగరాలకు సుమారు 15 నిమిషాలు, ఎయిమ్స్ మంగళగిరికి ఐదు నిమిషాలు, ఎన్ఆర్ఐ వైద్య కళాశాలకు ఎనిమిది నిమిషాలు, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సుమారు 30 నిమిషాల్లో చేరుకునే సౌకర్యం ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు...
ఈ ప్రాజెక్టులో 4, 5 పడక గదులతో కూడిన విశాలమైన విల్లాలను నిర్మించనున్నారు. ఒక్కో విల్లాకు 374 నుంచి 509 చదరపు గజాల వరకు స్థల విస్తీర్ణం ఉండనుంది. ప్రతి విల్లాకు నాలుగు కార్ల పార్కింగ్ సదుపాయంతో పాటు ప్రత్యేక క్లబ్‌హౌస్, పచ్చని ఆహ్లాదకరమైన బహిరంగ ప్రదేశాలు, ఆధునిక జీవనశైలికి అనుగుణమైన ఇతర సదుపాయాలను కల్పించనున్నారు. ప్రశాంతమైన వాతావరణం, సౌకర్యవంతమైన జీవనం, వ్యక్తిగత గోప్యతను సమన్వయం చేస్తూ ఈ నివాస సముదాయాన్ని రూపొందిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది...
ఈ సందర్భంగా మిరానా రియాల్టీ ఛైర్మన్ మురళీకృష్ణ యార్లగడ్డ మాట్లాడుతూ, అమరావతి రాజధాని ప్రాంతంలో తమ సంస్థ అడుగుపెట్టడం సంతోషంగా ఉందన్నారు. రాజధాని నిర్మాణం, మౌలిక సదుపాయాల విస్తరణ, ఆర్థిక కార్యకలాపాల పెరుగుదల నేపథ్యంలో మంగళగిరి భవిష్యత్తులో కీలక నివాస ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ది రిజర్వ్’ ద్వారా కేవలం విల్లాలను నిర్మించడమే కాకుండా, అత్యుత్తమ నిర్మాణశైలి, విశాలమైన ప్రదేశాలు, సౌకర్యాలు, గోప్యతతో కూడిన ప్రత్యేక జీవన అనుభవాన్ని అందించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కేవలం 59 విల్లాలకే ప్రాజెక్టును పరిమితం చేయడం ద్వారా నాణ్యత, ప్రత్యేకతకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు..
హైదరాబాద్‌కు చెందిన మిరానా రియాల్టీ సంస్థ టీమ్4 వ్యవస్థాపక సభ్య సంస్థగా రియల్ ఎస్టేట్ రంగంలో కొనసాగుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని మణికొండ, నానక్‌రామ్‌గూడలో ‘ఆర్కా’, మియాపూర్‌లో ‘ఆరియా’, ‘నైలా’ వంటి ప్రీమియం నివాస ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. పది మిలియన్ చదరపు అడుగులకు పైగా రియల్ ఎస్టేట్ అభివృద్ధి అనుభవంతో నాణ్యత, ఆధునిక నిర్మాణశైలికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోంది..
‘ది రిజర్వ్’ భూమిపూజతో అమరావతి రాజధాని ప్రాంతంలో తమ ప్రాజెక్టుల విస్తరణకు మిరానా రియాల్టీ శ్రీకారం చుట్టింది. భూమిపూజ పూర్తయిన నేపథ్యంలో నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.ఈ పూజా కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, కృష్ణా–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, మహా న్యూస్ ఎండి మారేళ్ళ వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.