Categories: MoviesSouth Cinema

Family entertainer ‘Mr. Middle Class’ now streaming on Amazon Prime & Aha OTT!!!

ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ & ఆహా ఓటిటిలో !!!

శ్రీకాంత్, లయ హీరో–హీరోయిన్లుగా, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో, ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడి అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

తాజాగా ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ చిత్రం అమెజాన్ ప్రైమ్ & ఆహా ఓటిటిలో స్త్రీమింగ్ అవుతోంది, థియేటర్స్ లో మిస్ అయిన ఆడియన్స్ ఇప్పుడు ఓటిటిలో చూసి ఈ ఫన్ ఎంటర్టైనర్ ను ఫ్యామిలీ తో చూసి ఎంజాయ్ చెయ్యవచ్చు.

 

హీరో శ్రీకాంత్ కు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆ సన్నివేశాలకు థియేటర్లలో విశేష స్పందన లభించింది, కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి.

మధ్యతరగతి కుటుంబాల జీవితం, వారి భావోద్వేగాలు, అనుబంధాలను హృద్యంగా ఆవిష్కరించిన ఈ చిత్రాన్ని దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి తనదైన శైలిలో అద్భుతంగా తెరకెక్కించారు. శ్రీకాంత్, లయ, రాజేంద్ర ప్రసాద్ తమ సహజమైన నటనతో సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ అందించిన సంగీతం సినిమాకు మరింత బలం చేకూర్చగా, సునీల్, వెన్నెల కిషోర్, రఘుబాబు, అలీ తదితరులు తమ అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను అలరించారు.

ఈ చిత్రాన్ని నిర్మాతలు చందు నూతి మరియు జీకే ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మించారు. ప్రతి ఫ్రేమ్‌లో నాణ్యత కనిపించేలా సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించి, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ముఖ్యంగా నిర్మాత చందు నూతి తొలి చిత్రంతోనే తన అభిరుచి, విజన్‌ను చాటుకోగా, నిర్మాత జీకే తన అనుభవంతో నిర్మాణానికి బలంగా నిలిచారు. ఇద్దరి సమన్వయంతో రూపొందిన ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ సక్సెస్ అయ్యింది.

నిర్మాతలు చందు నూతి మరియు జీకే భవిష్యత్తులో కూడా ఇలాంటి నాణ్యమైన, వినోదభరితమైన చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

‘మిస్టర్ మిడిల్ క్లాస్’ కుటుంబ సమేతంగా చూసి ఆనందించదగ్గ పూర్తి వినోదాత్మక చిత్రంగా ఇటీవల థియేటర్స్ లో ఇప్పుడు ఓటిటిలో విశేషంగా ఆకట్టుకుంటుంది.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share