‘ఇరుముడి’ లో ఇప్పటివరకూ చేయని క్యారెక్టర్ చేశాను. థ్రిల్‌తో పాటు అద్భుతమైన ఎమోషన్స్ ఉంటాయి. సినిమా యూనివర్సల్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది: హీరోయిన్ ప్రియా భవానీ శంకర్

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఇరుముడి'. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్, ట్రైలర్, పాటలతో ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తించింది. ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎమోషన్స్, యాక్షన్‌తో కూడిన డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఇరుముడిలో కావేరి పాత్ర ఎలా ఉండబోతుంది?
-మీరు ట్రైలర్ చూస్తే కథ గురించి ఇప్పటికే ఒక ఐడియా వచ్చి ఉంటుంది. కావేరి సింపుల్ ఫ్యామిలీ ఉమెన్. భర్త, కూతురు ఇద్దరే తన ప్రపంచం. ఫ్యామిలీని ఎంతో శ్రద్ధగా చూసుకుంటుంది. ఈ పాత్ర చేయడం నాకు చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్. ఇలాంటి పాత్రను ఇప్పటివరకు చేయలేదు. కావేరి లాంటి పాత్రలను రియల్ లైఫ్‌లో చూస్తుంటాం. నేను కూడా ఎంతోమందిని చూశాను. అందరికీ రిలేట్ అయ్యే పాత్ర చేశాను.
శివ నిర్వాణ గారు ఈ కథ చెప్పినప్పుడు మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలు ఏమిటి?
-శివ నిర్వాణ గారు అద్భుతమైన కథలు, పాత్రలు రాస్తారు. ఆయన కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. ఆయన గత సినిమాలు చూశాను. 'నిన్ను కోరి' సినిమా నా ఫేవరెట్. నేను చాలా తెలుగు సినిమాలు చూస్తాను.
-ఇరుముడిలో ఫాదర్-డాటర్ ఎమోషన్ యూనివర్సల్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది. ప్రపంచంలో ఎక్కడైనా ఆ ఎమోషన్ ఒకేలా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ క్యారెక్టర్స్‌కి కనెక్ట్ అవుతారు.
రవితేజ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-రవితేజ గారు అద్భుతమైన ఎనర్జీ ఉన్న యాక్టర్. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదు. రవితేజ గారి సినిమాలు చూశాను. కాకపోతే ఆయనతో కలిసి నటిస్తున్నప్పుడు నాకు ఒక కొత్త పర్సన్‌లా కనిపించారు. ఆయన చాలా డౌన్ టు ఎర్త్‌గా ఉంటారు. గ్రేట్ పెర్ఫార్మర్. ఆయనతో కలిసి నటించడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్.
శివ నిర్వాణ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-శివ నిర్వాణ గారు యాక్టర్స్‌కి చాలా స్వేచ్ఛ ఇస్తారు. సీన్ గురించి యాక్టర్స్‌తో చర్చిస్తారు. మంచి సజెషన్స్ ఉంటే తీసుకుంటారు. నిజంగా ఇది చాలా మంచి క్వాలిటీ. ఆయన చాలా పాజిటివ్‌గా, కూల్‌గా ఉంటారు. ఆయనతో కలిసి పని చేయడం చాలా కంఫర్ట్‌బుల్‌గా అనిపించింది.
కావేరి పాత్రలో ఉన్న ఛాలెంజ్ ఏమిటి?
-కావేరి పాత్రకు నాకు అసలు పోలిక లేదు. రియల్ లైఫ్‌లో నేను కావేరి పాత్రకు భిన్నంగా ఉంటాను. ఒక నటిగా ఇలాంటి పాత్రలు చేయడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కాకపోతే తెలుగు విషయంలో కొంత ఛాలెంజ్ ఎదురైంది. ఎందుకంటే ఇది అర్బన్ తెలుగు కాదు. అందులోనూ ఒక పల్లెటూరి యాస ఉంటుంది. ఆ లైన్స్‌ను పట్టుకోవడం ఛాలెంజ్‌గా అనిపించింది.
షూటింగ్ గురించి?
-దాదాపు 30 రోజులు సీలేరు ప్రాంతంలో జరిగిన షూటింగ్‌లో పాల్గొన్నాను. అక్కడి లొకేషన్స్ కథకు కావాల్సిన యాక్షన్ థ్రిల్లర్ టోన్‌ను యాడ్ చేశాయి. రిమోట్ ఏరియాస్‌లో షూట్ చేయడం కూడా ఒక ఛాలెంజ్.
ఇరుముడి ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుంది?
-తన పాపను తండ్రి (రవితేజ గారు) ఎంత ప్రేమ, బాధ్యతతో పెంచుతాడో ట్రైలర్‌లో చూసి ఉంటారు. అలాగే అమ్మాయి కూడా ఏం జరిగినా పేరెంట్స్‌తో చెప్పడం చాలా ముఖ్యం. అలాంటి కంఫర్ట్‌ను పేరెంట్స్ కల్పించాలి. ఈ సినిమా చూస్తున్నప్పుడు పిల్లలకు ఏం జరిగినా తమతో షేర్ చేసుకునే కంఫర్ట్‌ను పేరెంట్స్ ఇవ్వాలనే అంశం ఆలోచింపజేసేలా ఉంటుంది. ఇరుముడిలో థ్రిల్లర్‌తో పాటు మంచి ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది.
జీవీ ప్రకాష్ మ్యూజిక్ గురించి?
-జీవీ ప్రకాష్ గారు నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్. ఆయన ప్రతి ఆల్బమ్ అద్భుతంగా ఉంటుంది. ఇరుముడిలో ఆయన జాయిన్ అయిన వెంటనే ఇది క్లాసిక్ కల్ట్ సినిమా అవుతుందని, ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ కొడుతుందని మెసేజ్ పెట్టారు. ఆయన సినిమా విషయంలో చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నారు.
మైత్రి మూవీ మేకర్స్ గురించి?
-మైత్రి మూవీ మేకర్స్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్. ప్రతి సినిమాను ఎంతో గ్రాండ్‌గా, ప్యాషన్‌తో నిర్మిస్తున్నారు. ఈ షూటింగ్ అంత తేలిక కాదు. కాకపోతే మైత్రి మేకర్స్ అందరినీ ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. వారి నిర్మాణంలో పని చేయడం మంచి అనుభూతిని ఇచ్చింది.
మీకు డ్రీమ్ రోల్స్ ఉన్నాయా?
-నేను చాలా హ్యాపీ పర్సన్‌ని. కాకపోతే ఇప్పటివరకు సీరియస్ పాత్రలు ఎక్కువగా చేశాను. మంచి ఫన్ ఉన్న క్యారెక్టర్స్ చేయాలని ఉంది. దర్శకుడు శివ నిర్వాణ గారికి కూడా ఇదే చెప్పాను (నవ్వుతూ). ప్రేక్షకులను నవ్వించే సినిమా చేయాలని ఉంది.
దూత 2 గురించి?
-షూటింగ్ స్టార్ట్ అయ్యింది. తొలి పార్ట్‌కు కొనసాగింపుగా ఉంటుంది. అలాగే 'డిమోంటి కాలనీ 3' రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇంకొన్ని ప్రాజెక్ట్స్ చర్చల్లో ఉన్నాయి.
ఆల్ ది బెస్ట్
-థాంక్యూ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.