Categories: MoviesSouth Cinema

Psychological thriller ‘Lucy’ completes shoot

సైకలాజికల్ థ్రిల్లర్‌ 'లూసీ' షూటింగ్ పూర్తి

విభిన్న కాన్సెప్ట్‌తో రూపొందుతున్న 'లూసీ' చిత్రానికి సంబంధించిన షూటింగ్ విజయవంతంగా పూర్తైంది. మైండ్-బెండింగ్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను సస్పెన్స్, థ్రిల్, ఊహించని మలుపులతో అలరించనుందని చిత్ర బృందం తెలిపింది.

సైన్మా స్టూడియోస్ బ్యానర్‌పై రాఘవేంద్ర పూజారి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అండాలమ్మ పిక్చర్స్ సమర్పిస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఐటీ వరంగల్‌లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న రాఘవేంద్ర పూజారి, టాలీవుడ్‌లో అత్యంత చిన్న వయసులో చదువును కొనసాగిస్తూనే సినీ నిర్మాణ రంగంలో నిర్మాత గా కూడా తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించాలనే లక్ష్యంతో వరుస సినిమాలను నిర్మించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. యువతకు స్ఫూర్తిగా నిలిచేలా విద్యతో పాటు సినీ నిర్మాణాన్ని సమతూకంగా కొనసాగించాలని ఆయన సంకల్పించారు.

 

మహదేవ్ చిరంజీవి కథ, దర్శకత్వం వహించగా, ఆశిష్ పసుల, కిరణ్ పట్టేటి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రంలో చరణ్ రాజ్, శశాంక్ బాలు, ప్రశాంతి ఏడే, బల్వీర్ సింగ్, రంజిత్ నగెళ్లి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తవడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే టీజర్, ట్రైలర్, విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడనున్నాయి. సైకలాజికల్ థ్రిల్లర్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు 'లూసీ' ఒక కొత్త అనుభూతిని అందించనుందనే నమ్మకాన్ని చిత్ర బృందం వ్యక్తం చేస్తోంది.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share