Risk Telugu Movie Review: A Well-Made Thriller (Rating: 3.0)

నటీనటులు : సందీప్ అశ్వ, సాన్యా ఠాకూర్, జోయా జవేరి, రాజీవ్ కనకాల, తరుణ్ సాగర్, రవీంద్రనాథ్ ఠాగూర్
సాంకేతికత: ఛాయాగ్రాహకుడు : జగదీష్ కొమరి, సంగీత దర్శకుడు : ఘంటాడి కృష్ణ, ఎడిటర్ : శివ శర్వాణి, నిర్మాతలు : ఘంటాడి కృష్ణ, గుర్రం నర్సింహులు, రావి సురేష్ రెడ్డి, దర్శకుడు : ఘంటాడి కృష్ణ

సంగీత దర్శకుడిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం ఇచ్చిన
ఘంటాడి కృష్ణ రిస్క్ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. 2026, జూన్ 26న విడుదల అయ్యింది . ఏ గేమ్ ఆఫ్ యూత్ అనే కాప్షన్ జోడించారు. అంతా కొత్తవారితో తీసిన సినిమా ఎలా వుందో చూద్దాం.

కథ:
కార్తీక్ (సందీప్ అశ్వ) అతని ముగ్గురు స్నేహితులు మోసాలు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. మాజీ మిస్ ఇండియా సందలి అరోరా (జోయా జవేరి)కి దగ్గరవ్వాలనే ఉద్దేశంతో, వారు మ్యూజిక్ వీడియో మేకర్లుగా నటిస్తారు. అయితే, సందలి తన భర్త ప్రదీప్ చక్రవర్తి (అనీష్ కురువిల్లా)ని అంతం చేయమని వారిని కోరడంతో వారి ప్లాన్ ఊహించని మలుపు తిరుగుతుంది. ఆమె తన భర్తను ఎందుకు చంపాలనుకుంటుంది? ఆ నలుగురు ఆమె ప్రతిపాదనను అంగీకరిస్తారా? అనే ప్రశ్నలకు సమాధానాలు మిగిలిన కథలో తెలుస్తాయి.

 

సమీక్ష:
సినిమా అంటే ఓ సూత్రం వుంటుంది. దాని కోసం ఎన్నో ఏళ్ళుగా దర్శకుల దగ్గర పనినేర్చుకుని దర్శకుడు కావడం ఆనవాయితీ. కానీ మారిన ట్రెండ్ ను బట్టి యూత్ యూట్యూబ్ లో రీల్స్ చేస్తూ దర్శకులు అవుతున్నారు. కానీ, సంగీత దర్శకుడిగా పేరున్న ఘంటాడి సినిమాకే దర్శకుడు కావడం విశేషం. ఇందుకోసం నలుగురు కొత్త కుర్రాళ్ళను ఎంచుకున్నారు. వారితో ఆయన చేయించిన నటన కొత్తగా ఉంది, ఆయన రాసుకున్న కథ కథనాలు అద్భుతంగా ఉన్నాయి.

సినిమాలో ప్రతీ సన్నివేశం ఆసక్తికరంగా ఉంది, ఇన్ ఫోసిస్, టెక్ మహేంద్ర వంటి కంపెనీలలో బ్యాక్ గేట్ నుంచి ఉద్యోగాలకు వెళ్ళినవారిని చూశాం. అలా హరో సందీప్ అశ్వ ఓ కన్ సల్టెంట్ కంపెనీ పెడతాడు. అతని దగ్గరకు వచ్చిన వారందరికీ అర్హత లేకపోయినా ఉద్యోగాలు వచ్చేస్తాయి. అందులో హీరోయిన్ పాత్ర ఒకటి.

సినిమాకు మొదటి భాగం రెండోభాగం చాలా ఆసక్తికరంగా సాగుతాయి, ప్రతి సన్నివేశం ఆకట్టుకుంటుంది, దర్శకుడు ఏసుకున్న పాయింట్ సరికొత్తగా ఉంది, అందరూ నటినటలు బాగా చేశారు

రాజీవ్ కనకాల పాత్ర సినిమాకు కొంత విశ్వసనీయతను చేకూర్చింది, యువకులతో ఆయనకు ఉన్న సన్నివేశాలు సినిమాలో మంచి ఘట్టాలుగా నిలిచాయి. సంగీత పరంగా చూస్తే, దర్శకుడిగ, సంగీత దర్శకుడిగా ఘంటాడి కృష్ణ మెరుగ్గా రాణించారు; కొన్ని పాటలు మంచి ముద్ర వేస్తాయి.

ఘంటాడి కృష్ణ సంగీత దర్శకుడిగా విజయం సాధించాడు. కథనంలో లోతు వల్ల, సినిమా తన పూర్తి సామర్థ్యాన్ని నిరూపిస్తుంది. శివ శర్వాణి ఎడిటింగ్ ఇంకా పదునుగా ఉండాల్సింది, అయితే జగదీష్ కొమారి సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. కుటుంభ సభ్యులు అందరూ కలిసి సంతోషంగా ఈ సినిమాను వీక్షించవచ్చు

రేటింగ్ : 3/5

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share