‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

గత రెండేళ్లుగా తెలుగు, తమిళ, కన్నడ, మళయాల టెలివిజన్ నిర్మాతలతో ఎన్నోసార్లు చర్చించి, చివరగా జనవరి 2026లో చెన్నైలో అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి మీటింగ్ నిర్వహించుకుని ‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం కావలసిన అన్ని ప్రక్రియలు రిజిస్ట్రేషన్, బైలాస్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులతో కలిసి ‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’సంస్థ అధికారికంగా ఏర్పరిచారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈ టాప్కోస్ కు సంబంధించిన వివరాలను అన్నిటినీ తెలియజేశారు.
మరి ఈ సందర్భంగా టాప్కోస్ అధ్యక్షుడు ఏ ప్రసాద్ రావు మాట్లాడుతూ..
‘పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈ సంవత్సరం సౌత్ ఇండియన్ టెలివిజన్ అండ్ ఓటిటి పరిశ్రమ గుర్తించుకోదగిన చారిత్రాత్మకమైన దినంగా మేం పరిగణిస్తున్నాం. ఎందుకంటే నాలుగు రాష్ట్రాల నిర్మాతల మండళ్లు కలిసి ఒక ఆర్గనైజేషన్ గా ఏర్పడటం ఇదే మొట్ట మొదటిసారి. దీని వెనకాల రెండున్నరేళ్ల కృషి ఉంది. దీనికి చొరవ తీసుకున్నది తెలుగు టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. 2011లో టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏర్పడింది. ఆ రోజున దాసరి నారాయణరావు, తమ్మారెడ్డి భరద్వాజ గారి ఆధ్వర్యంలో ఈ కౌన్సిల్ ఏర్పడింది. 2012 నుంచి బైలాస్ తయారు చేసుకుని, రూల్ ఆఫ్ వర్కింగ్ ప్యాట్రన్ తయారు చేసుకున్నాం. ఇది 15యేళ్లు పూర్తి చేసుకుంది. అయితే టాప్కోస్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడానికి మూలం తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ గత 15యేళ్లుగా దానికి సాధించిన విజయాలు. ఒక నిర్మాణాత్మకమైన, గొప్ప ఐక్యత కలిగిన ఒక కౌన్సిల్ గా డెవలప్ కావడం.. తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీ ఫెటర్నిటీకి ఎనలేని సేవలు అందించే స్థాయికి చేరుకుంది. తెలుగు టివి పరిశ్రమకు, నిర్మాతలు, నటీ నటులు, సాంకేతిక నిపుణులు, కార్మికులు అందరికీ పెద్ద దిక్కుగా తెలుగు కౌన్సిల్ నిలబడింది. ఈ ప్రాసెస్ లో ఓ మూడేళ్ల నుంచి ఇంటర్ స్టేట్ ప్రొడక్షన్స్ బాగా పెరిగాయి. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఎక్జేంజ్ పెరిగింది. కన్నడ నుంచి ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్స్ రావడం.. ఇక్కడి ప్రొడ్యూసర్స్ కన్నడకి, తమిళ్ కు రావడం.. తమిళనాడు నుంచి ప్రొడ్యూసర్స్, ఆర్టిస్టులు రావడం, అలాగే మళయాల నుంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ రావడం.. తెలుగు వాళ్లు కేరళకు వెళ్లి అక్కడ సీరియల్స్ చేయడం జరుగుతోంది. ఇలా ఇంటర్ స్టేట్ యాక్టివిటీస్ పెరగడంతో.. ఈ నాలుగు రాష్ట్రాల నిర్మాతల మధ్య ఒక సమన్వయం ఉంటే బావుండేది అని దాదాపు రెండేల్లుగా మేం మిగతా మూడు రాష్ట్రాల నిర్మాతలో సంప్రదించడం మొదలు పెట్టాం. అనేక చర్చలు, చాలా తీర్మానాలు చేసిన తర్వాత ఈ జనవరి లో చెన్నైలో నాలుగు రాష్ట్రాల నిర్మాతలు జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ మీటింగ్ తర్వాత టాప్కోస్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఒక కామన్ ప్లాట్ ఫామ్ లో నిర్మాతల కోసం వారి సంక్షేమం గురించి ఫైట్ చేయొచ్చు అని 2026 జనవరిలో చెన్నెలో జరిగిన సమావేశలంలో నిర్ణయించుకోవడం జరిగింది. దీంతో పాటు మొత్తం 17మందితో ఒక అడ్ హాక్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. దీనికి రిజిస్ట్రేషన్ చేయడం కోసం చాలా కష్టపడ్డాం. మాకు దీనికి ఏ గైడ్ లైన్స్ లేదు. సౌత్ ఇండియన్ టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు ఒక చట్ట ప్రకారం తయారు చేయడానికి మార్గదర్శకమైన గైడ్ లైన్స్ లేదు. మా నుంచి ప్రతి సమస్య, ప్రతి కార్యక్రమాన్ని విశ్లేషించుకుని.. దాని నుంచి కార్యాచరణ రూపొందించుకుంటూ ప్రతి సమస్యను సునిశితంగా పరిశీలించి అనేక చర్చల తర్వాత ఒక బై లా తయారు చేసుకోవడం జరిగింది. ఈ బై లా మొట్టమొదటి సారిగా టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నాలుగు రాష్ట్రాల నుంచి ఆరు నెలల పాటు ప్రయత్నించిన తర్వాత అందరికీ ఉపయోగపడేలా ఉండేలా ఒక స్పష్టమైన ఈ బై లా తయారు చేసుకున్నాం. ఈ బై లా ను ఇవాళ అఫీషియల్ గా లాంచ్ చేశాం. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ టెలివిజన్ చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో చిరస్థాయిగా నిలిచిపోయే దినం. ఇది మరింతగా బలపడాలని కోరుకుంటున్నాం. మా ప్రధాన లక్ష్యం ప్రతి భాషకూ ప్రత్యేకమైన కల్చర్ ఉంటుంది. ప్రత్యేకమైన వర్కింగ్ ప్యాట్రన్ ఉంటుంది. రెమ్యూనరేషన్స్, బడ్జెట్స్ వేరుగా ఉంటాయి. ఒక్కో భాషలో ఒక్కో రకంగా ఉంటుంది. కానీ ఆయా భాషలలో ఉండే వర్కింగ్ కల్చర్ ను గౌరవిస్తూనే.. ఎక్జేంగ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, ఎక్జేంగ్ ఆఫ్ ఆర్టిస్ట్స్, ఎక్జేంగ్ ఆఫ్ టెక్నీషియన్స్.. ఇలా కామన్ గా ఉండే ఇష్యూస్ మీద నాలుగు భాషల నిర్మాతల మండళ్లు, ఒకే కామన్ కోడ్ తో పనిచేయాలి అనేది మా లక్ష్యం. నాలుగు రాష్ట్రాల నిర్మాతల సంక్షేమం, వారి హక్కులు, బాధత్యలను గుర్తు చేస్తూ వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ.. ప్రభుత్వాలను కూడా రిప్రజెంట్ చేస్తూ.. సౌత్ ఇండియన్ టివి, ఓటిటి ఇండస్ట్రీ పర్ఫెక్ట్ గా, ప్రొడక్టివ్ గా నడవడానికి కోసం గైడ్ లైన్స్ ఇవ్వడం అనేది మా టాప్కోసం ప్రధాన ఉద్దేశ్యం. దీనికి ఎదురయ్యే సవాళ్లన్నీ ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నాం. టివి పరిశ్రమను సినిమా పరిశ్రమ నుంచి వేరు చేయడానికే మాకు మూడేళ్ల టైమ్ పట్టింది. ఇవాళ టివి పరిశ్రమ ఎంత గొప్పగానో ఎదిగింది. సినిమాల్లోని ఆర్టిస్టుల కంటే సీరియల్స్ లో ఉండే ఆర్టిస్టులను బాగా గుర్తు పడుతున్నారు. దాదాపు 15వేల మంది తెలుగు టివి పరిశ్రమను నమ్ముకుని జీవిస్తున్నారు. అంటే మిగతా భాషల నుంచి ఇంకా వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి పెద్ద పరిశ్రమను పకడ్బందీగా నడిపించడం కోసం మేం నిర్మాతల మండళ్లు, టాప్కోస్ ను ఒక ఎజెండాగా తీసుకుని కృషి చేయడం జరుగుతుంది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి నిర్మాతలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడం లక్ష్యంగా ఉన్నాం. మరోవైపు టివి నిర్మాతల మండలి అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తెలుగు నిర్మాతల మండలి ఆధ్వర్యంలో కరోనా టైమ్ లో 4.5 కోట్లకు పైగా కార్మికులకు ఇబ్బంది లేకండా చూసుకున్నాం. ఇలాంటి సమన్వయం నాలుగు రాష్ట్రాల నుంచి కూడా ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఈ తరహాలోనే టాప్కోస్ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబోతున్నాం. మా తర్వాతి టార్గెట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. అన్ని భాషల్లో ఉన్నటువంటి టివి పరిశ్రమ, ఓటిటి నిర్మాతలందరినీ సమన్వయ పరిచి ఒక నేషనల్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం అనేది మా తర్వాతి లక్ష్యం..’ అని ముగించారు.
టాప్కోస్ వైప్ ప్రెసిడెంట్ ఉదయ్ శంకర్ గారు మాట్లాడుతూ.. ‘ అందరికీ నమస్కారం.. నేను ప్రెసిడెంట్ ఆఫ్ తమిళనాడు టెలివిజన్ అండ్ ఓటిటి అసోసియేషన్. నాకు చాలా ఆనందంగా ఉంది. మేం నలుగురు సౌత్ ఇండియన్ భాషల నుంచి అందరం కలిసి మాట్లాడుకోవడం నచ్చింది. ఒకప్పుడు వ్యక్తిగతంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. మిగతా భాషల్లో కూడా అదే పరిస్థితి. దీనికి పరిష్కారం ఏంటీ అనేది తెలియక ఇబ్బంది పడేవాళ్లం. దీనికి పరిష్కారంగా అందరం కలిసి మాట్లాడుకున్నాం. ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ అసోసియేషన్, కౌన్సిల్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ చెబుతున్నాను..’ అన్నారు.
కర్ణాటక ఎగ్జిక్యూటివ్ మెంబర్ సునిల్ కుమార్ జే.కే మాట్లాడుతూ.. ‘నమస్కారం. ప్రెసిడెంట్ ప్రసాద్ గారికి థ్యాంక్స్. ఇవాళ అన్ని భాషల అసోసియేషన్ స్టార్ట్ చేయడానికి మొదటి కారణాల్లో నేనూ ఉన్నాను. కర్ణాటకలో మాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి. కానీ తెలుగు ఇండస్ట్రీ చూసి మేం అవాక్కయ్యాం. వీళ్లు ఎంత బాగా ఈ అసోసియేషన్ నడిపిస్తారు అని చూసి మేం చాలా అసూయపడ్డాం. తర్వాత మేం సెక్రటరీని, ప్రెసిడెంట్ ను కలవాలని ప్రయత్నించాం. బెంగళూరులో కలవాలనుకున్నాం. కానీ ఆ టైమ్ లో మా మీటింగ్ సక్సెస్ కాలేదు. కానీ తర్వాత మళ్లీ కలుసుకున్నాం. ప్రసాద్ గారి వల్ల మళ్లీ ఇది సాధ్యం అయింది. అందరం కలిసి ఈ ప్రయాణాన్ని చాలా బాగా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాం..’అన్నారు.
కేరళ నుంచి ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణన్ సేతుకుమార్ మాట్లాడుతూ..‘నమస్తే నేను మళయాల టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. ప్రసాద్ గారు చెప్పినట్టుగా సౌత్ ఇండియన్ టెలివిజన్ ఇండస్ట్రీకి ఇదో చారిత్రాత్మకమైన రోజు. మేమంతా కలిసి ఈ కౌన్సిల్ ముందుకు తీసుకువెళ్లడానికి, టెలివిజన్ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇందుకోసం ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నా..’ అన్నారు.
చెన్నై నుంచి ఆర్గనైజింగ్ సెక్రటరీ నుంచి రాజా వేలు మాట్లాడుతూ.. ‘మాకు చెన్నైలో ఎప్పుడూ చెప్పేవారు.. హైదరాబాద్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చాలా బాగా చేస్తున్నారు అని. అది విన్నాం. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అర్థమైంది.. వాళ్లు చాలా ఆర్గనైజ్డ్, చాలా డిసిప్లిన్డ్ అని. ఇది మాకు చెన్నైలో కనిపించేది కాదు. ఆ కారణంగా ప్రసాద్ గారు అలాగే మీ టీమ్ నుంచి చాలా స్ఫూర్తి తీసుకున్నాం. పాఠాలూ నేర్చుకున్నాం. మేమెళ్లి రీ కన్ స్ట్రక్ట్ చేశాం. అలాగే మా దగ్గర యాక్టర్స్ చాలా సమస్యలు ఉన్నాయి. సగం పని ఇక్కడ నుంచి వేరే చోట సగం పని చేయడం చూస్తున్నాం. దీనివల్ల నిర్మాతలు చాలా నష్టపోతున్నాం. ఈ మొత్తాన్ని ప్రసాద్ గారితో పాటు మిగతా నిర్మాతలతో కలిసి మాట్లాడిన తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నాం. అందులో నుంచి పుట్టిందే ఈ కౌన్సిల్. ఇక ముందు కూడా ఇలాగే ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నా..’అన్నాడు.
ట్రెజరర్ డి.వై చౌదరి మాట్లాడుతూ..‘అందరికీ ధన్యవాదాలండీ. ముఖ్యంగా మా నిర్మాతలతో పాటు మిగతా నిర్మాతలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్’ అన్నారు.
TOPCOS అధ్యక్షుడు :
ఏ ప్రసాద్ రావు
వైస్ ప్రెసిడెంట్స్ :
ఉదయ్ శంకర్
అరవింద్
జి. జయ కుమార్
జనరల్ సెక్రటరీ :
రాజా వేలు
ట్రెజరర్ :
డి.వై. చౌదరి
పి.ఆర్.ఓ
దుద్ది శ్రీను - బాబురావు
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.