Categories: MoviesSouth Cinema

Bheemseri telugu movie now streaming on Amazon Prime and bcineet OTT

భీంసేరి చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మరియు బి సినీ ఈటీ ఓటిటి లలో స్త్రీమింగ్ !!!

మహేష్ పెగ్గర్ల, సిరి రావులాచారి, కుమార్ ఐటమ్, సుమన్, సునీల్, స్వప్న సంద, సౌజన్య, రాము ప్రధాన పాత్రల్లో దుర్గపల్లి ప్రభాకర్ నిర్మాతగా రవీంద్ర పూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భీంసేరి. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ మరియు బి సినీ ఈటీ
ఓటిటి లలో డైరెక్ట్ గా బి సినీ ఈటీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా విడుదల చేశారు.

ఒక క్రూరమైన పోలీస్ అధికారిణి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, ఒక నిరుపేద కుటుంబాన్ని దారుణమైన అన్యాయంతో నాశనం చేస్తుంది. ఆ దుర్ఘటన నుండి ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి, ఒక బలమైన, దృఢ సంకల్పం గల మహిళ, ప్రతీకారం తీర్చుకోవాలనే తీవ్రమైన కోరికతో బూడిద నుండి తిరిగి పుంజుకుంటుంది. ఆమె ఆ అధికారిణి కోసం వేటాడుతుండగా, కొన్ని చీకటి నిజాలు వెలుగులోకి వస్తాయి. ఇది అధికారం, అపరాధభావం మరియు న్యాయం మధ్య ఒక ఉత్కంఠభరితమైన పోరాటానికి దారితీస్తుంది, ఇది భీంసేరి చిత్ర ఇతివృత్తం.

 

ఆసక్తికరంగా సాగే ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మరియు బి సినీ ఈటీ
ఓటిటి లలో స్ట్రీమ్ అవుతోంది, చక్కటి కథ కథనలతో రూపొందిన ఈ సినిమాను కుటుంభ సభ్యులు మొత్తం కలిసి చూడవచ్చు.

భీంసేరి చిత్రం అమెజాన్ మరియు బి సినీ ఈటీ
ఓటిటి లలో స్ట్రీమ్ అవుతున్న సందర్బంగా చిత్రం యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది, ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు, బి సినీ ఈటీ
ఓటిటి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పాల్గొన్నారు.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share