Zamana movie completed censor, in theaters from January 30

సెన్సార్ పూర్తి చేసుకొని జనవరి 30న థియేటర్స్ లో క్రైమ్ థ్రిల్లర్ ‘జమాన’

సూర్య శ్రీనివాస్‌, సంజీవ్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జమాన’. భాస్కర్‌ జక్కుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తేజస్వి అడప నిర్మాత గా వ్యవహరించారు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఇటీవల గ్రాండ్ గా జరిగింది, తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి, యు/ఏ సట్టిఫికెట్ పొందిన ఈ మూవీ జనవరి 30న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కాబోతోంది.

జమాన సినిమా డిఫరెంట్ గా ఉంటుంది, మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్ తో ఈ సినిమాను తీయడం జరిగింది. సినిమా ఆద్యంతం వినోదంతో పాటు ఊహించని ట్విస్ట్ లు ఉంటాయి. ఈ సినిమాను దర్శకుడు భాస్కర్ చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నడిపించారు. సినిమా తప్పకుండా అందరిని అలరిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. ఎమ్. జి మూవీస్ అచ్చిబాబు ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ ఎడిటర్ ఎం అర్ వర్మ ఎడిటింగ్ చేశారు, అతని వర్క్ సినిమాకు అదనపు ఆకర్షన కానుంది.

‘నేటి యువతరం ఆలోచనలకు అద్దం పట్టే చిత్రమిది. హైదరాబాద్‌ పాతబస్తీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. జమాన చిత్రంలో చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుంది’ . నేటి యూత్‌కి కనెక్ట్‌ అయ్యే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. స్వాతి కశ్యప్‌, జారా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జగన్‌ ఏ, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సంగీతం: కేశవ కిరణ్‌, రచన-దర్శకత్వం: భాస్కర్‌ జక్కుల.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%