Krishnamma Movie Review: A raw and rustic revenge drama (Rating: 3.25)

సత్యదేవ్... ప్రతి సినిమాకి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందారు. ఇప్పటి వరకు తాను నటించిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించాయి తాజాగా డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మలపాటి నిర్మించిన "కృష్ణమ్మ" చిత్రంలో ఓ మాస్ ఇమేజ్ ఉన్న పాత్రను పోషించారు. వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అథిరా రాజ్, అర్చన, మీసాల లక్ష్మణ్, నందగోపాల్, కృష్ణ తేజ, రఘు కుంచె తదితరులు నటించారు. ఎంతో ఎమోషనల్ రివెంజ్ స్టోరీ నేపథ్యంలో... రా అండ్ రస్టిక్ గా తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ రివేంజ్ డ్రామా ఆడియెన్స్ ను ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ:

భద్ర(సత్యదేవ్), కోటి(లక్ష్మణ్ మీసాల), శివ(కృష్ణతేజ) ముగ్గురు చిన్నప్పట్నుంచి ఫ్రెండ్స్. విజయవాడ వించిపేటలో అనాధలుగా పెరుగుతారు. వించిపేట మనుషులు డబ్బులిస్తే వేరే వాళ్ళ కేసులను తమ మీద వేసుకొని వెళ్తుంటారు. వించిపేట ఏరైలో ఉండే దాసన్న దగ్గర గంజాయి తీసుకురావడం లాంటి కొన్ని క్రిమినల్ పనులు చేసి భద్ర, కోటి బతుకుతుంటారు. శివ మాత్రం ఓ ప్రింటింగ్ షాప్ పెట్టుకొని వీళ్ళని కూడా మార్చాలనుకుంటాడు. ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు ఈ ముగ్గురు. అలాంటి సమయంలో శివ లైఫ్ లోకి మీనా(అథిరా రాజ్) వస్తుంది. శివ, మీనా ప్రేమలో పడటం, భద్రకి రాఖీ కట్టి అన్నయ్య అని పిలవడంతో తనకి కూడా ఓ ఫ్యామిలీ వచ్చిందని సంతోషిస్తాడు. ఇలా హ్యాపీగా లైఫ్ సాగిపోతున్న టైంలో మీనాకు ఓ కష్టం వస్తుంది. అదే టైంలో భద్ర, శివ, కోటిలను ఓ కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తారు. మీనాకు వచ్చిన కష్టం ఏంటి? ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ని ఏ కేసులో అరెస్ట్ చేసారు? వీళ్ళని కేసులో ఎవరు ఇరికిస్తారు? వీళ్ళకి ఒక ఫ్యామిలీ ఏర్పడిందా? అనేవి తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే.

కథ ... కథనం విశ్లేషణ:

అనుకోకుండా చేయని నేరానికి శిక్ష పడే కథలు గతంలో పలు సినిమాల్లో చూపించినా ఈ సినిమాలో స్నేహం, ఫ్యామిలీ ఎమోషన్ చుట్టూ ఆ కథ రాసుకున్నారు. విజయవాడ కృష్ణా నది ఒడ్డున ఈ సినిమా తెరకెక్కించారు. కృష్ణా నది ఎక్కడో పుట్టి మలుపులు తిరుగుతూ వెళ్తుంది. అలాగే కృష్ణమ్మ సినిమాలో ఎక్కడ ఎవరికీ పుట్టారో తెలియని ముగ్గురి ఫ్రెండ్స్ జీవితం ఎలా మలుపులు తిరిగింది అన్నట్టు టైటిల్ కి తగ్గట్టు కథ నడిపించారు. ముగ్గురు అనాథలను స్నేహితులుగా తీసుకొని స్నేహం, ఫ్యామిలీ ఎమోషన్స్ ని బాగా పండించారు. ఇంటర్వెల్ కి ఓ ట్విస్ట్ ఇచ్చి నెక్స్ట్ ఏంటి అనే ఓ ఆసక్తి నెలకొల్పారు. కృష్ణమ్మ సినిమా ఎమోషన్స్ తో కూడిన ఓ రివెంజ్ స్టోరీని రా & రస్టిక్ గా తెరకెక్కించారు. క్లైమాక్స్ లాస్ట్ సీన్ ఆశ్చర్యపోవాల్సిందే. మాస్ ను బాగా అలరిస్తుంది. గో అండ్ వాచ్ ఇట్.

పాత్ర ఎదైనా అవలీలగా చేయగలిగే నటుల్లో సత్యదేవ్ ఒకరు. ఈ సినిమాతో మరోసారి సత్యదేవ్ తన నటనతో మెప్పించాడు. వించిపేట భద్రగా సత్యదేవ్ అదరగొట్టేసాడు. ఫ్రెండ్స్ పాత్రల్లో లక్ష్మణ్ మీసాల, కృష్ణ తేజ బాగా పోటీ పడి నటించారు. మలయాళీ అమ్మాయి అథిరా రాజ్... మీనా అనే తెలుగమ్మాయిలా నటించి మెప్పించింది. హోమ్లీ గా కనిపించింది. సత్యదేవ్ పక్కన అర్చన అయ్యర్ పాత్ర పర్వాలేదు. పోలీసాఫీసర్స్ గా నందగోపాల్ బాగా ఆకట్టుకున్నాడు. ఇతని నటన ఆశిష్ విద్యార్థి నటనను పోలి ఉంటుంది. క్రైం ఇన్వెస్టి గేశన్ ఆఫీసర్ గా రఘు కుంచె నటించారు.. మిగిలిన నటీనటులు వారి పాత్రల మేరకు పర్వాలేదనిపించారు.

కృష్ణమ్మ... ముందుగా చెప్పినట్టు చాలా వరకు విజయవాడ, చుట్టుపక్కల ప్రాంతాల్లోనే షూట్ చేయడంతో... బెజవాడ లొకేషన్స్ ని చాలా బాగా చూపించారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. కాలభైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు పాటలకు ఇచ్చిన సంగీతం మెప్పించింది. కథనం కొత్తగా రాసుకొని దర్శకుడిగా గోపాలకృష్ణ సక్సెస్ అయ్యాడు. నిర్మాణ పరంగా సినిమా క్వాలిటీ చూస్తుంటే ఖర్చు బాగానే పెట్టారు అని తెలుస్తుంది. ఎడిటింగ్ కూడా గ్రిప్పింగ్ గా వుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. మాస్ ఆడియెన్స్ ను "కృష్ణమ్మ" అలరిస్తుంది.

రేటింగ్: 3.25

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.