Sukumar Launched Title Poster Of Virat Raj, Ganesh Master, Shrreepada Films’ Movie Titled Goud Saab, Muhurtham Held Grandly Today

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ లాంచ్ చేసిన విరాట్ రాజ్, గణేష్ మాస్టర్, శ్రీపాద ఫిలింస్ ' గౌడ్ సాబ్' మూవీ టైటిల్ పోస్టర్- గ్రాండ్ గా ప్రారంభం

రెబల్ స్టార్ కృష్ణంరాజు బంధువు యంగ్ హీరో విరాట్ రాజ్ హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మల్లీశ్వరి సమర్పణలో శ్రీపాద ఫిలింస్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ కళ్యాణమండపం రాజు, కల్వకోట వెంకట రమణ, కాటారి సాయికృష్ణ కార్తీక్‌లు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఈరోజు పూజా ముహూర్తంతో సినిమా గ్రాండ్‌గా లాంచ్ అయింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ టైటిల్‌ను లాంచ్ చేశారు. ఈ చిత్రానికి 'గౌడ్ సాబ్' అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు.

పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైయింది. డైరెక్టర్ సుకుమార్ మేకర్స్ కు స్క్రిప్ట్ అందించగా, రాహుల్ షిప్లిగంజ్ క్లాప్ కొట్టారు. జోనీ మాస్టర్, భాను మాస్టర్, అన్నీ మాస్టర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా గణేష్ మాస్టర్ ముహూర్తం సన్నివేశానికి దర్శకత్వం వహించారు.

మూవీ లాంచింగ్ సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. గణేష్ చాలా ప్రతిభావంతుడు. 'జగడం' సినిమాలో కొరియోగ్రఫర్ గా పరిచయం చేశాను. తన పరిచయమే ఒక సునామీలా వుంది. ప్రతి మూమెంట్ ని చాలా కొత్త చేశాడు. తనకి పరిశ్రమ చాలా మంచి భవిష్యత్ వుంటుందని అప్పుడే చెప్పాను. తను చాలా క్రియేట్ గా వుంటాడు. తన చేసిన ప్రతి పాటలో కథ వుంటుంది. పాట ద్వారా కథ చెప్పే నేర్పు తనకి వుంది. ఇప్పుడు గౌడ్ సాబ్ తో తను దర్శకుడిగా మారడం ఆనందంగా వుంది. తను ఈ కథ చెప్పినప్పుడు షాక్ అయ్యాను. కథ చాలా చాలా బావుంది. టైటిల్ లో కూడా ట్విస్ట్ వుంది. ఇంత మంచి కథతో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా అద్భుతం అవుతుంది. తను చెప్పిన పాయింట్ చాలా గొప్పగా వుంది. హీరో, నిర్మాతలు, టీం అందరికీ ఆల్ ది బెస్ట్'' తెలిపారు.

శ్యామల దేవి మాట్లాడుతూ.. మా విరాట్ మూవీ గణేష్ మాస్టర్ గారి దర్శకత్వంలో లాంచ్ కావడం చాలా ఆనందంగా వుంది. గణేష్ మాస్టర్ చాలా ప్రతిభావంతులు. విరాట్ అంటే కృష్ణం రాజుగారికి చాలా ఇష్టం. తను హీరో అవుతాడని దీవించారు. గౌడ్ సాబ్ టైటిల్ లోనే మాస్ కనిపిస్తుంది. మంచి టీంతో ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.

హీరో విరాట్ రాజ్ మాట్లాడుతూ.. సుకుమార్ గారి ధన్యవాదాలు. ఆయన మా సినిమా పోస్టర్ లాంచ్ చేయడం మెమరబుల్ మూమెంట్. ఈ సినిమా మా కెరీర్ లో ఒక ఉత్తమ సినిమాగా నిలిచిపోతుంది. కథ, కథనం అద్భుతంగా కుదిరాయి. నిర్మతలు ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎస్ఆర్ కళ్యాణమండపంలానే ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. వారితో మళ్ళీమళ్ళీ పని చేయాలి. తప్పకుండా మీ అందరి సపోర్ట్ కావాలి' అన్నారు.

డైరెక్టర్ గణేష్ మాస్టర్ మాట్లాడుతూ.. డ్యాన్స్ మాస్టర్ గా నన్ను ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు మరో అడుగు వేశాను. దీనికి కూడా మీ అందరి సపోర్ట్ కావాలి. ఇప్పటివరకూ నేను చేసిన పాటలు చూశారు. ఇప్పుడు సినిమా చూడబోతున్నారు. గౌడ్ సాబ్.. ట్రూ లవ్ స్టొరీ. తప్పకుండా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. మీ అందరి ప్రోత్సాహం కావాలి. సుకుమార్ గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు' తెలిపారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. సుకుమార్ గారికి ధన్యవాదాలు. గౌడ్ సాబ్.. ట్రూ లవ్ స్టొరీ. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం ఎంతలా అలరించిందో గౌడ్ సాబ్ కూడా అదే విధంగా ప్రేక్షకులకు మంచి ఎంటర్ టైన్మెంట్ పంచుతుంది. మీ అందరి ఆదరణ కావాలి' అన్నారు.

గౌడ్ సాబ్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్. సినిమాలో మంత్రముగ్ధులను చేసే ప్రేమకథ ఉంటుందని సూచిస్తూ, టైటిల్ పోస్టర్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ హ్యాండిల్ కి అమ్మాయి వోని చుట్టుకొని వుండటం చాలా ఆసక్తికరంగా వుంది.

ఈ చిత్రానికి ఆర్‌ఎం స్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. లిరిక్ రైటర్ వెంగీ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, 'బేబీ' ఫేం సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్. భాను మాస్టర్ క్రియేటివ్ హెడ్ కాగా, మహాదేవ స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్. ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా చిత్ర యూనిట్ కొంతమంది దివ్యాంగులకు ఆర్థిక సాయం అందించింది.

తారాగణం: విరాట్ రాజ్
సాంకేతిక విభాగం:
రచన & దర్శకత్వం: గణేష్ మాస్టర్
నిర్మాతలు: SR కళ్యాణమండపం రాజు, కల్వకోట వెంకట రమణ, కాటారి సాయి కృష్ణ కార్తీక్
బ్యానర్: శ్రీపాద ఫిలింస్
సమర్పణ: మల్లీశ్వరి
సంగీతం: వెంగి
డీవోపీ: RM స్వామి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
క్రియేటివ్ హెడ్: భాను మాస్టర్
ఆర్ట్ డైరెక్టర్: బేబీ సురేష్ భీమగాని
కొరియోగ్రఫీ: పృధ్వీ రాజ్
స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: ఎ మహదేవ
పీఆర్వో: వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైనర్: సుధీర్
కాస్ట్యూమ్స్: రోహిణి దుబ్కులSukumar Launched Title Poster Of Virat Raj, Ganesh Master, Shrreepada Films’ Movie Titled Goud Saab, Muhurtham Held Grandly Today

Young hero Virat Raj, a relative of late actor Krishnam Raju, is making his debut as a hero with a film that marks the directorial debut of popular choreographer Ganesh Master. Billed to be an out-and-out entertainer, the movie will be produced by SR Kalyanamandapam Raju, Kalvakota Venkata Ramana, and Catari Sai Krishna Karthik under the banner of Shrreepada Films, while Malleswari presents it.

The movie has been launched grandly today with a pooja muhurtham ceremony. Star director Sukumar who graced the occasion unveiled the title. The movie is titled Goud Saab. Sukumar stated that he heard the storyline from Ganesh Master and he loved it completely. He predicted this one to be a sure-shot blockbuster. He then lent best wishes to Ganesh Master, Virat Raj, and the entire team.

Goud Saab is an out-and-out action entertainer. Indicating the movie will have an enchanting love story, the title poster apart from a Royal Enfield bike sees Voni of a girl, though her face is not seen.

RM Swamy will take care of the cinematography for the movie. Lyricist Vengi is debuting as a music director. Chota K Prasad is the editor, while Baby Suresh Bhimagani is the art director. Bhanu Master is the creative head, whereas A Mahadeva is the script co-ordinator.

The film’s lead actress and other details are awaited.

Cast: Virat Raj

Technical Crew:
Written & Direction: Ganesh Master
Producers: SR Kalyanamandapam Raju, Kalvakota Venkata Ramana, Catari Sai Krishna Karthik
Music: Vengi
DOP: RM Swamy
Editor: Chota K Prasad
Creative Head: Bhanu Master
Art Director: Baby Suresh Bhimagani
Choreography: Prudhvi Raj
Script co-ordinator: A Mahadeva
PRO: Vamsi-Shekar
Publicity Designer: Sudheer
Costumes: Rohini Dubkula

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.